అభివృద్ధిలో అధికారులదే కీలకపాత్ర
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:03 AM
నిమ్మనపల్లె మండల అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే షాజహానబా షా సూచించారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): నిమ్మనపల్లె మండల అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే షాజహానబా షా సూచించారు. సోమవారం స్థానిక బెంగళూరు బస్టాండు వద్ద ఎమ్మెల్యే కార్యాలయంలో నిమ్మన పల్లె మండలానికి చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ పల్లెపండుగ కార్యక్రమంలో మండలంలో సీసీరోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాల నిర్వహణ, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్‌పై ఆర్‌డబ్ల్యూఎస్, పంచా యతీ కార్యర్ధులు దృష్టి సారించాలన్నారు. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న వరిపంట వివరాలు నమోదు చేసి పంపాలని ఏవోను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత కనెక్షన్లు మంజూరు చేయడంలో ఎందుకు ఆలస్యమవుతోందని ఎస్పీడీసీఎల్ ఏఈని వివరణ అడిగారు. మండలంలోని ఆరు హైస్కూళ్లు, ఆరు ప్రాథమిక పాఠశాలల్లో 90 మంది విద్యార్థులు డ్రాపౌట్లుగా ఉన్నారని, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవోను ఆదేశించారు. ప్రతి రోజు ఒక పాఠశాలను తనిఖీ చేసి అక్కడ మధ్యాహ్న బోజనం పథకం అమలు, విద్యాబోధన, సమస్యల పై దృష్టి పెట్టాలన్నారు. శాంతిభద్రతల సమస్య, కేసుల నమోదు తదితర విషయాలపై ఎస్‌ఐ తిప్పేస్వామిని వివరాలు అడిగితెలుసుకున్నారు.. ఈ సమావేశంలో పీఆర్ డీఈ శివశంకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మిథునచక్రవర్తి, ఏవో మురళీమోహన, ఎంఈవో పద్మావతి పాల్గొన్నారు.
టీడీపీలో కార్యకర్తలకు సముచిత స్థానం
రామసముద్రం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): తెలు గుదేశం పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు, విధేయులకు పార్టీ ఎప్పుడూ అం డగా ఉంటూ సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే షాజహానబాషా స్పష్టం చేశారు. రామస ముద్రం మండలంలో గత రెండురోజుల క్రితం జరిగిన సాగునీటి సంఘ ఎన్నికలలో ఎన్నికైన చైర్మనలు మండల టీడీపీ అధ్యక్షుడు విజయ్‌కు మార్‌గౌడు సారధ్యంలో సోమవారం మదనప ల్లెలో ఎమ్మెల్యేను కలిశారు. ఈసందర్భంగా చైర్మన లను ఎమ్మెల్యే అభినందించి శాలువతో సన్మానిం చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి చైర్మన పదవు లు ఇచ్చి సముచిత స్థానం కల్పించామని తెలిపా రు. అదేవిధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, మురు గు కాలువల నిర్మాణ పనులు ఆయా గ్రామాల లోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘ చైర్మనలు ఈశ్వర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరాజు, వెంకటాచలపతి, నాయకులు టేకుపల్లె రామమూర్తి, వెంకటేష్, వికాస్, కల్లు రమేష్, చినస్వామి, బద్రినాథ్, శివ, రమేష్, నడింపల్లె వాలెప్ప, మాజీ సర్పంచ రెడ్డిశేఖర్, వేణుగోపాల్, శీనప్ప, లోకనాథ్‌రాజు, సుధాకర్‌రెడ్డి, కృష్ణప్ప, శ్రీరాములు ఉన్నారు.
Updated Date - Dec 17 , 2024 | 12:03 AM