వరదబాధితుల కోసం బీసీ నేతల సహాయ కార్యక్రమాలు
ABN, Publish Date - Sep 12 , 2024 | 11:48 PM
విజయవాడ వరదబాధితుల కోసం ప్రొద్దుటూరు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు తెలిపారు. గురువారం సాయం త్రం బీసీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం లోమాట్లా డుతూ నాలుగు రోజులుగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, వైద్యులు దాతలనుంచి దాదాపు మూడు లక్షల మేరకు విరాళాలు సేకరించామన్నారు.
మూడు లక్షల విలువైన దుస్తులు, సామగ్రి సేకరణ
నేడు విజయవాడలో పంపిణీ కి తరలింపు
ప్రొద్దుటూరు, సెప్టెంబరు 12 : విజయవాడ వరదబాధితుల కోసం ప్రొద్దుటూరు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు తెలిపారు. గురువారం సాయం త్రం బీసీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం లోమాట్లా డుతూ నాలుగు రోజులుగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, వైద్యులు దాతలనుంచి దాదాపు మూడు లక్షల మేరకు విరాళాలు సేకరించామన్నారు. ఆ డబ్బుతో వరదబాధితుల కోసం కొత్త దుస్తులు, దుప్పట్లు, టవళ్లు కొనుగోలు చేశామన్నారు. మండి మర్చంట్ వ్యాపారులు ఇచ్చిన నిత్యావసర సామగ్రిని ప్యాక్ చేసి వాటిని కలిపి దాదాపు 500 కుటుంబాలకు స్వయంగా ఇక్కడి నుంచి లారీలో తీసుకెళ్లి బాధితలుకు అందజేయన్నుట్లుతెలిపారు. కార్యక్రమంలో బీసీ నేతలు జీసీ పుల్లయ్య, గిద్దలూరు మల్లికార్జున ప్రభుకుమార్, బత్తల శ్రీను, వెల్లెపు శ్రీనివాసులు ,సుంకరవేణు ,మాడి శెట్టి ప్రతాప్,వజ్జల క్రిష్టయ్య, గోపవరం అంజి, మైలగానీ శ్రీనివాసులు. వేల్పుల భాస్కర్, కాటం కిరణ్, పోసా ఆదినారాయణ ,నన్నురు మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 11:48 PM