సర్వేయర్లకు బయోమెట్రిక్ హాజరు మినహాయించాలి
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:49 PM
క్షేత్రస్థాయిలో పనిచేసే తమకు బయోమెట్రిక్ హాజరు నుంచి మిన హాయింపు ఇవ్వాలని పీలేరు మండ లంలోని గ్రామ సర్వేయర్లు విజ్ఞప్తి చేశారు.
పీలేరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పనిచేసే తమకు బయోమెట్రిక్ హాజరు నుంచి మిన హాయింపు ఇవ్వాలని పీలేరు మండ లంలోని గ్రామ సర్వేయర్లు విజ్ఞప్తి చేశారు. రీ-సర్వే గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంతో పాటు రీసర్వే రాళ్ల మీద పేర్ల తొల గింపు కార్యక్రమంలో పాల్గొంటున్న తమకు గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు వేసేందుకు వీలుపడడం లేద ని వారు తెలిపారు. ప్రతిరోజూ బయోమెట్రిక్‌లో ఇన అండ్ ఔట్ హాజరు వేస్తేనే జీ తాల బిల్లులు పెడతామని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారని ఆ రెండు పను లు పూర్తయ్యే వరకు తమకు బయోమెట్రిక్ హాజరు మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. ఈ మేరకు సోమవారం వారు పీలేరు తహసీల్దారు భీమేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తహసీల్దారు మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తహసీల్దారుకు వినతి పత్రం
అందజేస్తున్న సర్వేయర్లు

Updated Date - Dec 02 , 2024 | 11:49 PM