బస్సు షెల్టరు లేక ప్రయాణికుల ఇక్కట్లు
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:09 AM
వల్లూరులో బస్సు షెల్టరు లేక ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీ తమయ్యాయి.
వల్లూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : వల్లూరులో బస్సు షెల్టరు లేక ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీ తమయ్యాయి. నిలువ నీడ లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వారు పడే బాధలు అన్నీఇన్నీ కావు. కడప- తాడిపత్రి హైవేపై బస్సు షెల్టరు కొరత ప్రయాణికులను తీవ్రంగా బాధిస్తోంది. ప్ర భుత్వాలు మారినా ప్రజల కష్టాలు తీరడం లేదు. వల్లూరు మండలం నుంచి కట్ట, తప్పె ట్ల, కుమారునిపల్లె, కొప్పోలు, వ ల్లూరు, ఎ.ఓబాయపల్లె, గోటూరు, తోళ్లగంగనపల్లె, రామిరెడ్డికొట్టాలు స్టేజీల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే కొప్పోలు, గోటూరు స్టేజీలు మినహాయిస్తే ఎక్కడా బస్సు షెల్టర్లు లేవు. మండల కేంద్రమైన వ ల్లూరు చాలా గ్రామాలకు ప్రధాన కేంద్రం. నిత్యం ప్ర యాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. వేసవిలో దుకాణాలే ప్రజలకు కొంత వరకు నీడనిస్తుంటాయి. గత ప్రభుత్వంలో దాతల సహకారంతో ప్రయాణికులు కూర్చునేందుకు బెంచలు ఏర్పాటు చేసి నా అవి వైసీపీ సానుభూతిపరులు తమ దుకాణం వద్ద ఏర్పాటు చేసుకోవడంతో అక్కడికి వెళ్లి కూర్చునేందుకు ప్రయాణికులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. బస్సు నిలిపేందుకు అనువుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. అ యితే దుకాణదారులు కొంత మంది ఆ ట్రాక్‌లను ఆక్రమించారు. కాగా గతంలో ప్రయాణికులు, బాటసారుల సౌకర్యం కోసం సత్రాలు నిర్మించారు.
తోళ్లగంగనపల్లె, వల్లూరు, కొప్పోలు స్టేజీల వద్ద సత్రాలు ఉండేవి. అయితే రోడ్డు విస్తరణతో అవి కాలగర్భంలో కలిసిపోయాయి. వల్లూరు లో వద్ద ఉన్న సత్రం రోడ్డు విస్తరణలోకి వస్తుంది అని ఆర్‌అండ్‌బీ అధికారులు దాన్ని పూర్తిగా తొలగించారు. కానీ ఇటీవల సత్రం కంటే ముందుకు వచ్చి కొంత మంది నిర్మాణాలు చేపట్టారు. షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించి వేలాది రూపాయలు అద్దెలు వసూ లు చేసుకుంటున్నారు. ప్రధాన రోడ్డుపై వచ్చే వాహనాలు వ ల్లూరు నుంచి వచ్చే వారికి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు బస్సుషెల్టరు ఏర్పాటుపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
దాతలు ముందుకు రావాలి
ట్రస్టు పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న దాత లు బస్సు షెల్టరు ఏర్పాటుకు కూడా ముందుకు రా వాల్సిన అవసరం ఉంది. ఇందుకు సహకరిస్తే ప్రయాణికులకు నీడకు కల్పించినవారవుతారు.
Updated Date - Nov 20 , 2024 | 12:09 AM