చంద్రబాబు శ్రమ ఆదర్శనీయం
ABN, Publish Date - Sep 25 , 2024 | 11:23 PM
సీఎం చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో రాష్ట్రం కోసం, ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కడప నగరంలోని జడ్పీ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మించిన జడ్పీ కాంప్లెక్స్ సముదాయాన్ని కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పుత్తా చైతన్యరెడ్డి, రెడ్డెప్పగారి మాధవి, జడ్పీ ఇనచార్జి చైర్‌పర్సన జె.శారదతో కలసి ప్రారంభించారు.
వందరోజుల పాలనలో ప్రజా సంక్షేమం
దీపావళి నుంచే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
తిరుమల లడ్డు నాణ్యతలో తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు
జడ్పీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రిరాంప్రసాద్‌రెడ్డి
కడప రూరల్, సెప్టెంబరు 25: సీఎం చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో రాష్ట్రం కోసం, ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కడప నగరంలోని జడ్పీ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మించిన జడ్పీ కాంప్లెక్స్ సముదాయాన్ని కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పుత్తా చైతన్యరెడ్డి, రెడ్డెప్పగారి మాధవి, జడ్పీ ఇనచార్జి చైర్‌పర్సన జె.శారదతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాషా్ట్రన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కోటి అమలు చేస్తూ వస్తున్నామన్నారు. 100 రోజుల పాలనలోనే ప్రజాసంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలుచేసి కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పింఛన మొత్తాన్ని ఏడాదికి రూ.250 పెంచుకుంటూ పోతే తమ టీడీపీ ప్రభుత్వం ఒకేసారి రూ.1000 పెంపుచేసి ప్రతి నెల ఒకటో తారీఖునే రూ.4000 ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెగా డీఎస్సీ ఫైలుపై సీఎం సంతకం చే సి మంత్రి వర్గంలో ఆమోదించామన్నారు. అతి త్వరలోనే 16,500 డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్నక్యాంటీన్లను రద్దుచేస్తే టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి లక్షలాది మంది పేదలకు తక్కువ ధరకే భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. రానున్న 20 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంటుందన్నారు. దీపావళి నుంచి రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికి ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో తిరుమల లడ్డును కూడా అపవిత్రం చేసి దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేటతెల్లమైందన్నారు. దీనిపై విచారణకు సిట్ ఏర్పాటైందని, తప్పుచేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ లోతేటి శివశంకర్, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డి, జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ పిట్టు బాలయ్య యాదవ్, జడ్పీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 25 , 2024 | 11:23 PM