ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్సీ
ABN, Publish Date - Sep 09 , 2024 | 12:18 AM
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 8: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్‌జేయూపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్యక్షతన పదవీ విరమణ పొందిన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడానికి కట్టుబడి ఉందని అన్ని సంఘాల సహకారంతో స మావేశం నిర్వహించి వారి అభిప్రాయాల మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ పెండింగులో ఉన్న ఏకీకృత సర్వీసు నిబంధపలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, టీచర్‌హోం అధ్యక్షుడు బండారు రజాగోపాల్, ఆర్‌జేయూపీ కడప జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసాదరావు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 09 , 2024 | 12:18 AM