నిమ్మనపల్లి మండల సమస్యలపై మంత్రికి ఫిర్యాదు
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:08 AM
నిమ్మనపల్లి మండల సమస్యలపై రాయచోటి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి సోమవారం టీడీపీ యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు టీడీ పీ మండల అఽధ్యక్షుడు వెంకటరమణ, నాయ కులు కలిసి వినతిపత్రం అందజేశారు.
నిమ్మనపల్లి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): నిమ్మనపల్లి మండల సమస్యలపై రాయచోటి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి సోమవారం టీడీపీ యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు టీడీ పీ మండల అఽధ్యక్షుడు వెంకటరమణ, నాయ కులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బం దులకు గురై లేని పోని కేసులతో పోరాడా రన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికా రంలోకి రావడంతో సంబరపడ్డ కార్యకర్తలను గుర్తించేవారు లేరన్నారు. ఈ నెల 14న జరిగిన సాగునీటి ఎన్నికల్లో బాస్కర్‌రెడ్డికి మండల నాయకుల మద్దతు తెలియజేస్తే అందుకు విరుద్ధంగా మరో వ్యక్తిని పోటీకి దింపారని తెలిపారు. అనంతరం మండలంలోని కందూ రు-మదనపల్లి రోడ్డు మంజూరు చేయాలని, గ్రామాలలో సీసీరోడ్లు, మురుగు నీటి కాలువ లు నిర్మించాలని కోరారు. మంత్రి రాంప్రసా ద్‌రెడ్డి సానుకూలంగా స్పదించి ప్రతి సమస్య ను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల అఽధ్యక్షుడు వెంకటరమణ, బీసీసెల్ జిల్లా అధ్మక్షుడు లక్ష్మన్న, సర్పంచలు మల్లప్ప నాయకులు చినబాబు, భాస్కర్‌రెడ్డి, మల్లికా ర్జున, విజయ్, చెండ్రాయుడు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2024 | 12:08 AM