ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి
ABN, Publish Date - Nov 02 , 2024 | 11:21 PM
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ భూ మిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
పులివెందుల టౌన, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ భూ మిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన నివాసం వద్ద అనారోగ్యంతో ఇబ్బంది పడిన వారి కుటుంబాలకు దాదాపు 28 మందికి రూ.29 లక్షల సీఎం సహాయ నిధి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి అందించేలా కృషి చేస్తానన్నారు. అనంతరం ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమస్యను చెప్పిన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Nov 02 , 2024 | 11:21 PM