ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలి

ABN, Publish Date - Sep 30 , 2024 | 11:00 PM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు వర్గాలు వివిధ సమస్యలు పరిష్కరిం చాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలు నిర్వహించాయి.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు వర్గాలు వివిధ సమస్యలు పరిష్కరిం చాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలు నిర్వహించాయి.

రాయచోటి (కలెక్టరేట్‌)సెప్టెంబరు 30: రాష్ట్రంలో వున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమ వారం సమగ్ర శిక్ష అభియాన, మున్సిపాలిటీ, అంగన్వాడీ, జూనియర్‌ లెక్చరర్లతో కలసి కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమగ్ర శిక్ష అభియాన అన్నమయ్య జిల్లా అధ్యక్ష్లుడు మురళీమోహన రాజు మాట్లాడుతూ.. తమ శాఖ ఉద్యోగులకు యాక్సిడెంట్‌ జరిగినా మెడికల్‌ బిల్లులు కూడా ఇవ్వడంలేదని అవేధన వ్యక్తం చేశారు. తమపై రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులు ఎక్కువ య్యాయన్నా రు. హెఅర్‌ పాలసీ అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ముదివీడు నిర్వాసితులకు పరిహారం చెల్లించండి...

నష్టపరిహారం చెల్లించి ముదివీడు రిజర్వాయర్‌ నిర్వాసితులను అదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రెండు మండలాలలో 780 ఎకరాల భూములకుగాను 108 కోట్లు నష్టపరిహారం చెల్లిస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతు కుటుంబానికి 5 సెంట్లు స్థలంతోపాటు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.25 లక్షలు,. భూమి లేని రైతులకు 5 లక్షలు, భూములు కోల్పుయిన వారికి ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

మార్కెట్‌ యార్డులలో ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలి

కలికిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేష్‌, రైతు సంఘం నాయకులు వంగిమళ్ల రంగారెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం ఆందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మార్కెట్‌ యార్డులలో పని చేస్తున్న అధికారులకు 15 ఏళ్లుగా స్థానచలనం లేకపోవడంతో అవినీతి, అక్రమా లకు పాల్పడుతున్నారని వివరించారు.

హామీలు నిలబెట్టుకోవాలి..

ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకో వాలని గ్రామ వలంటీర్లుఆందోళన చేశారు. తాము అఽధికారంలోని వస్తే వేతనం 10 వేలకు పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తా మని చెప్పారని, ప్రభుత్వం ఏర్పడి వందరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగం, జీతం లేకపోవడంతో వీధిన పడ్డామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించారు

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ప్రతి నెల చివరలో సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించాలని దళిత హక్కుల పోరాట సమితి అన్నమయ్య జిల్లా కార్యదర్శి యం,సుదీర్‌ కుమార్‌ కోరారు. ఈ విషయంపై కలెక్టరుకు వినతి పత్రం అంద జేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల ముందు నిర్వహించేవారని ఇప్పుడు అలా జరగడం లేదని వారు కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో గంగులయ్య, శ్రీనివాసులు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 11:00 PM