దోబీఘాటులో అవినీతి మకిలీ!
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:36 PM
గత ప్రభుత్వ హయాంలో దోబీ ఘాటులో అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.
పీలేరు, సెప్టెంబరు 20: గత ప్రభుత్వ హయాంలో దోబీ ఘాటులో అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. పీలేరు-తిరుపతి మార్గంలో ఉన్న దోబీఘాటుకు రజక సంఘ నాయకులు, సభ్యులు, దాతలు వేసిన బోరు, పైపు లైను, అందజేసిన మోటారుకు పంచాయతీలో పనిచేసే ఓ సాధారణ వాటర్ మెన బిల్లు చేసుకునేం దుకు ప్రయత్నించిన సంఘటనను రజక సంఘ నాయకులు కనుగొ న్నారు. తాము కష్టపడి చందాలు వేసుకుని వేసుకున్న బోరు ప్రభుత్వం వేసినట్లు రికార్డులు సృష్టించినట్లు తెలియడంతో వారు భగ్గుమన్నారు. విషయాన్ని పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన విచార ణకు ఆదేశించారు. పీలేరు పట్టణ ప్రజల అవసరాల కోసం 1990 ప్రాం తంలో పీలేరు-తిరుపతి మార్గంలో అప్పటి అధికారులు, ప్రజాప్రతి నిధులు దోబీఘాటును ఏర్పాటు చేశారు. దోబీఘాటు అవసరాలు పెరగ డంతో దానికి బోరు, మోటారు, పైపులైను అవసరం ఏర్పడి రజక సం ఘ నాయకులు తలో చేయి వేసుకుని, కొంత మంది దాతలను సంప్ర దించి బోరు, మోటారు, పైపులైను వేసుకున్నారు. అయితే ఆ బోరు ప్రభుత్వం వేసినట్లు గల నెల 23వ తేదీన పీలేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో వెల్లడి కావడంతో గ్రామసభకు హాజరైన రజక సంఘ నేతలు ఖంగుతిన్నారు. బోరు, మోటారు, పైపు లైను కోసం రూ.5 లక్షల దాకా వెచ్చించినట్లు అటు పంచాయతీ, ఇటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ద్వారా ఆ మొత్తం కోసం ఎంబుక్కు రికార్డు చేయించి బిల్లుల కోసం పంచాయతీ కార్యాలయంలో అందజేసినట్లు సమాచారం. అయితే బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరగడంతో ఆ వ్యవ హారం సాకారం కాలేదు. గతంలో పీలేరు పంచాయతీలో పలు పనులు చేసిన మదనపల్లెకు చెందిన ఓ సంస్థ తనకు రావాల్సిన బిల్లు ల కోసం పంచాయతీకి చెందిన పలు ఎంబుక్కులను తన వద్ద అట్టిపె ట్టుకుం దని దీంతో చెల్లింపులు జరగనట్లు తెలిసింది. ఈ విషయమై పీలేరు పంచాయతీ ఈవో గురుమోహన మాట్లాడుతూ దోబీఘాటు బిల్లుల ప్రయత్నం ఏడాదిన్నర క్రితం జరిగిందన్నారు. స్థానిక రజక సంఘం నేతలు ఆ విషయాన్ని తన దృష్టికి తేవడంతో తాను విచారణ కు ఆదే శించానని, అందులో భాగంగా ఎంబుక్కు మదనపల్లెకు చెందిన ప్రైవే టు సంస్థ వద్ద ఉన్నట్లు తేలిందన్నారు. అయితే వాటన్నింటిపై తాను జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేశానని, వారి ఆదేశా ల మేరకు చర్యలు తీసుకుంటానన్నారు.
Updated Date - Sep 20 , 2024 | 11:36 PM