సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:23 PM
పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిద్దవటం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరైతు ప్రధానమంత్రి సమ్మాననిధికి పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రమేష్‌రెడ్డి, రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయాధికారిని శైలజ, రైతుసేవా కేంద్రం సహాయకులు బి.సందీప్, గ్రామ సర్పంచ ఈశ్వర్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యం
గాలివీడు: వ్యవసాయంలో తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఏవో మురళీధర్ తెలిపారు. మంగళ వారం మండలంలోని గోపనపల్లె, అరవీడు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఏ ఈవో మనీషా, అగ్రికల్చర్ అసిస్టెంట్ అరుణ్ ప్రకా శరెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
భూసార పరీక్షలు చేయించుకోవాలి
రైల్వేకోడూరు(రూరల్): భూసార పరీక్షల ఆధారం గా ఎరువులు వాడితే తక్కువ ఖర్చుతో అధిక దిగు బడులు పొందవచ్చని వ్యవసాయ అధికారి సుధాకర్ తెలిపారు. మంగళవారం మండలం లోని కె.సి. అగ్రహారం, బయనపల్లె గ్రామాల్లో పొలం పిలుస్తోం ది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అరటి, బొప్పాయి, మామిడితో అధిక దిగు బడులకు పాటించాల్సిన చర్యలను వివరించారు. కూ రగాయలు, పూల పైర్ల సాగుకు ఉద్యానశాఖ రాయి తీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు, మా ర్కెటింగ్ చేసే సదుపాయం కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి ఎం.భాస్కర్, మార్కెటింగ్ మేనేజర్
Updated Date - Oct 22 , 2024 | 11:23 PM