సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చె ల్లించాలి: ఎస్టీయూ
ABN, Publish Date - Oct 25 , 2024 | 12:00 AM
సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
కడప ఎడ్యుకేషన, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో రాష్ట్ర అకౌంట్స్ జనరల్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ సంయుక్తగా నిర్వహించిన పెన్షన అదాలత కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రెజరీస్, అకౌంటెంట్ జనరల్‌కు ఎస్టీయూ నేతలు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల ఎంఈఓలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల పరిధిలో పనిచేస్తున్న ఉపాఽధ్యాయులకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం 2018 జూలై 2019 జనవరి డీఏలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసి రెండు డీఏలను ఆరు విడతలుగా 2021 సంవత్సరంలో బిల్లులు చేసుకోవాలని ఇచ్చిందన్నారు. ఈ ఆరు బిల్లులను పాత పెన్షన వారికి పీఎఫ్ ఖాతాలకు నూతన పెన్షన విధానంలో ఉన్న వారికి 10 శాతం మినహాయించి మిగిలిన 90 శాతం క్యాష్‌రూపంలో ఇచ్చే ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 30 శాతం మందికి జమ కాలేదన్నారు. తక్షణం జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇలియా్‌సబాషా, సంగమేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగంగిరెడ్డి, సీనియర్ నాయకులు జయరామయ్య, సాదిక్ పాల్గొన్నారు.
Updated Date - Oct 25 , 2024 | 12:00 AM