ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేవదాయ భూమి లీజు విషయమై వివాదం

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:47 PM

రామసముద్రం మండలం కురి జల పంచాయతీ కేంద్రంలోని పురాతన చెన్నకేశవస్వామి ఆలయ భూమి లీజు విషయమై వివాదం చోటుచేసుకుంది.

గ్రామసభలో ఘర్షణ పలువురిపై పోలీసులకు ఫిర్యాదు

రామసముద్రం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రామసముద్రం మండలం కురి జల పంచాయతీ కేంద్రంలోని పురాతన చెన్నకేశవస్వామి ఆలయ భూమి లీజు విషయమై వివాదం చోటుచేసుకుంది. ఈ ఆలయానికి సర్వే నెంబర్‌ 52/14లో 1.6సెంట్ల భూమి ఉండగా దానిని గత 30ఏళ్లుగా ఇదే గ్రామానికి చెందిన చెంగారెడ్డి అనుభవిస్తూ ఉన్నారు. ఈనేపథ్యంలో ఆలయ భూమిని దేవదాయశాఖ వారు లీజుకు ఇచ్చి తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ నిర్మాణానికి వెచ్చించాలని నిర్ణయించుకుని బుధవారం గ్రామ సభ నిర్వహించింది. దీంతో చెంగారెడ్డి అతని అనుచరులు లీజును వ్యతిరేకిస్తూ దేవదాయ శాఖ అధికారులను అడ్డుకోవడంతోపాటు గ్రామస్ధులతో వాగ్వా దానికి దిగారు. సంఘటనను విలేకర్లు వీడియో తీస్తుండగా చెంగారెడ్డి వర్గానికి చెందిన శ్రీకాంత అనే వ్యక్తి ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేసి, కుర్చితో కొట్టి సెల్‌ఫోన లాక్కున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. దేవదాయశాఖ అధికారులు తమ విధులకు ఆటం కం కలిగించారని చెంగారెడ్డి మరికొంత మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కాగా ఈ విషయంపై విచారణ చేపట్టి బాధితులపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు.

Updated Date - Nov 06 , 2024 | 11:47 PM