ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఊరేగింపుల్లో మంటపాల వద్ద డీజేకి అనుమతులు లేవు

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:17 PM

వినాయక విగ్రహాలు తీసుకు వచ్చేటప్పుడు, ఊరేగింపుల్లో డీజే పెట్టడం, బాణాసంచాలు పేల్చడానికి అనుమతులు లేవని ఆర్డీవో శ్రీనివాసులు, కమిషనర్‌ రఘునాథరెడ్డి ప్రకటించారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ సభాభవనంలో వినాయక ఉత్సవ విగ్రహ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఆర్డీవో శ్రీనివాసులు, కమిషనర్‌ రఘునాథరెడ్డి

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 2 : వినాయక విగ్రహాలు తీసుకు వచ్చేటప్పుడు, ఊరేగింపుల్లో డీజే పెట్టడం, బాణాసంచాలు పేల్చడానికి అనుమతులు లేవని ఆర్డీవో శ్రీనివాసులు, కమిషనర్‌ రఘునాథరెడ్డి ప్రకటించారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ సభాభవనంలో వినాయక ఉత్సవ విగ్రహ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంటపాలలో మట్టి వినాయక విగ్రహాలు మాత్రమే నెలకొల్పాలన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు పర్యావణానికి హానికరమన్నారు. ప్రతి రెండు మంటపాలకు ఒక పోలీసును పర్యవేక్షణకు పెడతామన్నారు. ప్రతి మంటపం వారు వివరాలు అందజేయాలన్నారు. మంటపాలు, విగ్రహాలకు విద్యుత్‌ లైట్ల ఏర్పాటులో సరఫరాలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి మంటపం వద్ద భక్తి పాటలు పెట్టాలన్నారు. భక్తిని అపహాస్యం చేసే పాటలు, డ్యాన్సులు చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు గంగయ్య, సీఐలు రామక్రిష్ణారెడి,్డ గోవిందరెడ్డి, బాలమద్దిలేటి, ఎస్‌ఐలు, విద్యుత్‌ శాఖ అధికారులు, ఉత్సవ విగ్రహ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 11:17 PM

Advertising
Advertising