అధైర్య పడొద్దు..బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
ABN, Publish Date - Dec 15 , 2024 | 11:46 PM
అధైర్య పదొ ద్దు...అండగా ఉంటానని తం బళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లె జయచం ద్రారెడ్డి బాధిత రైతు కుటుం బానికి భరోసా ఇచ్చారు.
రైతు పిల్లలకు చదువుకు అయ్యే రూ.4లక్షల ఖర్చును భరిస్తా
తంబళ్లపల్లె టీడీపీ ఇనచార్జి దాసరిపల్లె జయచంద్రారెడ్డి
ములకలచెరువు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): అధైర్య పదొ ద్దు...అండగా ఉంటానని తం బళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లె జయచం ద్రారెడ్డి బాధిత రైతు కుటుం బానికి భరోసా ఇచ్చారు. మం డలంలోని వేపూరికోట పంచా యతీ చీకుచెట్టుపల్లెలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బయ్యారెడ్డి కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న రైతు ఇద్దరు కూమార్తెలు శ్రీతేజ, సింధులకు రెండేళ్లకు అయ్యే రూ.4లక్షల ఖర్చును భరిస్తానన్నారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తానన్నారు. అనం తరం రైతు కుమార్తెలు చదువుతున్న కళాశాల యాజమాన్యంతో ఫోనలో మాట్లాడి తానే చదువుకు అయ్యే ఖర్చును చెల్లిస్తానని చెప్పారు. ఆయన వెంట నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జుననాయుడు, ఎంపీటీసీ శ్రీనివాసులురెడ్డి, నాయకులు మూగి రవిచంద్ర, భాస్కర్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, రెడ్డెప్ప, శ్రీరాములురెడ్డి, రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, బాలాజీ, బయ్యారెడ్డి, కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 11:47 PM