ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివాదాలు రేకెత్తించే నిర్మాణాలు చేపట్టవద్దు

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:20 PM

అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేపడితే వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ సంబంధీకులపై కేసులు నమోదు చేస్తామని సీఐ పురుషోత్తంరాజు హెచ్చరించారు.

పెన్నానదిలో దర్గా పక్కన నిర్మిస్తున్న గోడను పరిశీలిస్తున్న సీఐ పురుషోత్తంరాజు

అవి ఎలాంటివైనా తొలగిస్తాం : సీఐ పురుషోత్తంరాజు

చెన్నూరు, ఆగస్టు 30: అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేపడితే వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ సంబంధీకులపై కేసులు నమోదు చేస్తామని సీఐ పురుషోత్తంరాజు హెచ్చరించారు. వనంవీధిలోని నిజాముద్దీన్‌ దర్గాకు ఉత్తరం వైపు పెన్నానదిలో ఇటీవల చెన్నూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రహరీ, మరుగు దొడ్లు, స్నానం గదులు నిర్మాణం చేపట్టారు. దీంతో స్థానికులు పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి దృష్టికి తీసుకపోగా ఆయన సీఐకి తెలిపారు. అంతేకాక వనంవీధి, చెన్నూరు యువత ఆప్రాంతానికి చేరుకుని ఇక్కడ నిర్మాణాలు చేపట్టేదెవరు, ఎందుకు చేపడుతున్నారు, అనుమతులపై ఆరా తీశారు. అంతేకాకుండా నదిలో ఎలా కడతారని గట్టిగా ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి, సీఐలు ఆ కట్టడాలను పరిశీలించారు. వీటి ని తక్షణం తొలగించాలని పంచాయతీ సిబ్బందికి సీఐ తెలపడం, ఇలాంటి వాటి వల్ల వివాదాస్పద సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇప్పటికే చెన్నూరులో ఓ సమస్యతో రెండు వర్గాల్లో రెచ్చగొట్టేలా ఉందని, ఇప్పుడు మరలా అదే సమస్య ఉత్పన్నమవుతుంద న్నారు. పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ నెల కిందటే నిర్మాణాలు చేపట్టకూడదని తాను హెచ్చరించానని, అయినా నిర్మాణాలు చేపట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ నిర్మాణాలతో తాగునీటి పైపులైనుకు దోబిఘాట్‌కు ఇబ్బందికంగా ఉంటుందని తక్షణం తొలగించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన యువతకు సీఐ సర్ధిచెప్పి పంపారు. ఇలాంటి విషయాలు ఏమైనా జరిగితే ముందుగా తన దృష్టికి తేవాలని చెప్పడం జరిగింది.

Updated Date - Aug 30 , 2024 | 11:20 PM

Advertising
Advertising