ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దళారులను నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే

ABN, Publish Date - Dec 17 , 2024 | 11:42 PM

ఇళ్లకు పట్టాలిప్పి స్తామని కొంత మంది దఽళారు లు అమాయకులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని ఎమ్మెల్యే షాజహాన బాషా పేర్కొన్నారు.

బీకేపల్లెలో రజకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇళ్లకు పట్టాలిప్పి స్తామని కొంత మంది దఽళారు లు అమాయకులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని ఎమ్మెల్యే షాజహాన బాషా పేర్కొన్నారు. మంగళవా రం స్థానిక బీకేపల్లె రెవెన్యూ గ్రా మంలో రెవెన్యూ సదస్సు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంత మంది డీకేటీ భూములను ఆక్రమించుకుని అక్రమంగా విక్రయిస్తున్నారని, వారి మీద ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసులకు సిఫారసు చేస్తామన్నారు. డీకేటీ భూములు విక్రయించినా, కొను గోలు చేసినా చట్టరీత్యా నేరమని గుర్తు చేశారు. అర్హులైన వారు నేరుగా దరఖాస్తు చేసుకుంటే ఎన్టీఆర్‌ గృహనిర్మాణం పథకం కింద రెండు సెంట్ల ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.80లక్షలు ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీకేపల్లె అభివృద్ధి విస్మరించారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో సీసీరోడ్లు వేయించి అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు.

బీకేపల్లెలో ఎకరా స్థలంలో దోబీఘాట్‌

మదనపల్లె పట్టణానికి ఉత్తరం వైపున ఉన్న రజకుల అవసరానికి బీకేపల్లెలో ఎకరా స్థలంలో దోబీఘాట్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీకేపల్లె కాలనీలో పర్యటిం చిన ఆయన టీడీపీ నియోజకవర్గ బీసీ అధ్యక్షుడు నాగయ్య, రజక సంఘం నాయకుల కోరిక మేరకు దోబీఘాట్‌కు స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ స్థల సేకరణ పూర్తి కాగానే బోరు తవ్వించి, ప్రభుత్వ ఖర్చులతో దోబీఘాట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మల్లి కార్జున, రజక సంఘం నాయకులు రామ్మూర్తి, వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 11:42 PM