దసరా కానుకగా మధ్యంతర భృతి ప్రకటించాలి: ఏపీటీఎఫ్
ABN, Publish Date - Oct 07 , 2024 | 12:38 AM
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాసుందర్‌రెడ్డి అన్నారు.
కడప (ఎడ్యుకేషన), అక్టోబరు 6 : రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాసుందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 12వ పీఆర్సీ అమలులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే మధ్యంతర భృతి కల్పించాలన్నారు. నూతన ప్ర భుత్వం ఏర్పాటై నూరు రోజులు పూర్తయినా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయలేదన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషనను నియమించాలన్నారు. అలాగే పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులు కరువు భత్యం బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని, సరెండరు లీవు బకాయిలు, ఏపీజీఎల్‌ఐ బకాయిలు, పీఎఫ్ రుణాలను చెల్లించాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖాదర్‌బాషా, శ్రీనివాసరెడ్డి, రాఫ్ట్ర నాయకులు రమేశరెడ్డి, జిల్లా నాయకులు రామచంద్రరెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, నారాయణరెడ్డి, మస్తానబాబు, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 07 , 2024 | 12:38 AM