ఉర్దూ భాష అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:49 PM
టీడీపీ మైనార్టీల పక్షపాతి అని, ఉర్దూ భాష అభివృద్ధికి తాను సంపూర్ణంగా సహకరిస్తానని కడప ఎమ్మెల్యే మాధవి అ న్నారు.
కడప ఎడ్యుకేషన, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ మైనార్టీల పక్షపాతి అని, ఉర్దూ భాష అభివృద్ధికి తాను సంపూర్ణంగా సహకరిస్తానని కడప ఎమ్మెల్యే మాధవి అ న్నారు. శనివారం కడప నగ రం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంజుమన తరక్కి ఉర్దూ ఆధ్వర్యంలో జాతీయ ఉర్దూ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు చైర్మన సత్తార్‌ఫైజి అధ్యక్షత వహించగా హిదయతుల్లా కన్వీనరుగా వ్యహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత ఉందని, సొంత ఖర్చులతో ముద్రించి పంపిణీ చేస్తామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంజుమన తరక్కి ప్రతినిధుల బృందాన్ని సీఎం చంద్రబాబు తో చర్చిస్తామన్నారు. అమీర్‌బాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు, ఉర్దూ భాషాభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంటారన్నారు. ఆయన హయాంలోనే ఉర్దూకు రెండో అధికార భాషగా హోదా కల్పించారన్నారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉర్దూ భాషను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 11:49 PM