ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉర్దూ విద్యాభివృద్ధికి కృషి: అమీర్‌బాబు

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:10 AM

ఉర్దూ విద్యాసంస్థలు, భాషాభివృద్ధికి కృషి చేస్తామని పలువురు వక్తలు హామీ ఇచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న అమీర్‌బాబు

కడప ఎడ్యుకేషన, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఉర్దూ విద్యాసంస్థలు, భాషాభివృద్ధికి కృషి చేస్తామని పలువురు వక్తలు హామీ ఇచ్చారు. ఆదివారం కడప నగరం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంజుమన తరక్కి ఉర్దూ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఉర్దూ సెమినార్‌ ముగింపు సమావేశం చైర్మన సత్తార్‌ఫైజి, కన్వీనరు హిదయతుల్లా ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో చీఫ్‌ ప్యాట్రన అమీర్‌బాబు మాట్లాడుతూ ఉర్దూ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఉర్దూ ఉపాధ్యాయుల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఉర్దూ డీఎస్సీలో అభ్యర్థులు లేనిచోట ఆ పోస్టులను డీరిజర్వు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉర్దూ ఇంటర్‌, డిగ్రీ కళాశాల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఏపీ అధికారిక లోగోలో ఉర్దూను చేర్చాలని, కొత్త జిల్లాల్లో ఉర్దూ డీఐ, ఉర్దూ ఏఎంఓ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలన్నారు. దీంతో పాటు మరిన్ని తీర్మానాలను ప్రవేశపెట్టారు. చైర్మ న సత్తార్‌ఫైజి మాట్లాడుతూ ఉర్దూ అకడమిక్‌ చైర్మన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఉర్దూ చదవడం, రా యడం తెలిసినవారై ఉండాలన్నారు. కన్వీనరు సయ్యద్‌ హిదయతుల్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ప్రతి జిల్లా కలెక్టరేట్‌, ఆర్డీఓ, మంత్రుల కార్యాలయాల్లో ఉర్దూ అధికారులను నియమించాలని, ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను ప్రతి పాఠశాలకు సమయానికి చేరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సలీంబాషా, డాక్టర్‌ ఆలీఖాన, దావుద్‌ మోహిత, అహ్మద్‌షరీఫ్‌, ఖాజీ అబిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:10 AM