ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

ABN, Publish Date - Oct 28 , 2024 | 11:57 PM

చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు

సీసీ రోడ్డు పనుల భూమిపూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లతోపాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్‌ లక్ష్మిప్రసాద్‌రెడ్డి, మౌర్యారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా దర్బార్‌కు వినతుల వెల్లువ

చిన్నమండెం: రాష్ట్ర రవాణా,యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో అధిక సంఖ్యలో వినతిపత్రాలు అందాయి. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో స్వీక రించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. రా యచోటి నియోజకవర్గంలో భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ అధి కారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గతంలో భూ దోపిడీకి పాల్పడి న వారి నుంచి భూములు స్వాధీనం చేసుకొని పేదలకు ఇస్తామన్నారు. జిల్లాలోని అధికారులందరూ బాధితుల సమస్యలను సీరియస్‌గా తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి అప్యాయంగా పలుకరిస్తూవారి నుంచి అర్జీలు స్వీకరించారు.

=================

Updated Date - Oct 28 , 2024 | 11:57 PM