ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది

ABN, Publish Date - Nov 04 , 2024 | 11:41 PM

పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమా నికి వచ్చే ప్రజల సమస్యలన్నింటికి ఏదో ఒక పరిష్కారం ఉంటుందని ఇనచార్జి ఆర్డీవో రాఘవేంద్ర పేర్కొ న్నారు.

మదనపల్లె టౌన, నవంబరు 4(ఆం ధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమా నికి వచ్చే ప్రజల సమస్యలన్నింటికి ఏదో ఒక పరిష్కారం ఉంటుందని ఇనచార్జి ఆర్డీవో రాఘవేంద్ర పేర్కొ న్నారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టరేట్‌లో పీజీఆర్‌(గ్రీవెన్సడే) నిర్వహించారు. డివిజన నలుమూ లల నుంచి మొత్తం 53 మంది వివి ధ సమస్యలతో అర్జీలు అందజేశారు. బి.కొత్తకోట మండలం కోటావూరు గ్రామం వద్ద ఇనుప విద్యుత స్థంబాలు తుప్పు పట్టిపో యాయని, వాటిని తొలగించి, సిమెంటు స్థంబాలు ఏర్పాటు చేయాలని బిల్లూరువారిపల్లె యర్రమరెడ్డి విన్నవించారు. తమ అన్నదమ్ములకు వారసత్వ రీత్యా వచ్చిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని మదనపల్లె సీటీఎం గ్రామానికి చెందిన సిరాజున్నీసా అర్జీ ఇచ్చారు. తన ఇంటికి ఒకే డోర్‌ నెంబర్‌ వున్నా మదనపల్లె మున్సిపా లిటీ వారు రెండు ఇంటి పన్నులు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని, ఒక పన్ను చెల్లించినా, రెండోది కూడా చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని రామారావుకాలనికి చెం దిన వృద్దురాలు నాగమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తనకు హౌసింగ్‌ స్థలం చూపించి, లోను కూడా ఇచ్చారని ఆలోనుతో ఇంటి నిర్మాణం చేపట్టినా, ఏళ్లు గడుస్తున్నా స్థలానికి పట్టా ఇవ్వలేదని వాల్మీకిపురం మండలం బర్నేపల్లెకు చెందిన అరుణ వినతి పత్రం అంద జేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా మండలాల అధికారులకు రెఫర్‌ చేయ డంతో పాటు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆర్డీవో ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఏవో పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 11:41 PM