ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి ఒక్కరూ పరోపకార గుణం కలిగి ఉండాలి

ABN, Publish Date - Sep 29 , 2024 | 11:46 PM

ప్రతి ఒక్కరూ పరో పకార గుణం కలిగి ఉండాలని ట్రాఫిక్‌ సీఐ హాజీవలి అన్నారు.

దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న సీఐ

పులివెందుల టౌన, సెప్టెంబరు 29: ప్రతి ఒక్కరూ పరో పకార గుణం కలిగి ఉండాలని ట్రాఫిక్‌ సీఐ హాజీవలి అన్నారు. ఆదివారం పులివెందుల పట్టణంలోని విభిన్న ప్రతిభావంతుల కార్యాలయంలో వేముల మండలం శేషన్నగారిపల్లెకు చెందిన వేముల మాజీ ఉప సర్పంచ ఓటికుంట నాయుడు ఏడవ వర్ధంతి సందర్భంగా దివ్యాంగులకు రూ.50వేలు విలువ చేసే నిత్యావసర వస్తువులను వితరణ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఓటికుంటనాయుడు వేముల మాజీ ఉప సర్పంచగా పనిచేసి అందరి మన్ననలను పొందారన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిన్నకుమారుడు ఓజియన ఇనఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ ఓటికుంట గంగాధర్‌నాయుడు దివ్యాంగులకు నిత్యావసరాలు అందజేయడం అభినందనీయమని సీఐ పేర్కొన్నారు. వితరణ దాత గంగాధర్‌నాయుడు మాట్లాడు తూ దివ్యాంగుల అభ్యున్నతి కోసం తమ వంతు సహాయం చేస్తామన్నారు. రాష్ట్ర వికలాంగుల నెట్‌వర్క్‌ అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, ఓటికుంట కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 11:46 PM