ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్థిక సంక్షోభంలోనూ అద్భుత పాలన

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:55 PM

ఆర్థిక సంక్షోభంలోనూ అద్భుత పాలన అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.

చెన్నూరు ఉప్పరపల్లెలో మాట్లాడుతున్న కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి

అందుకే ఇది మంచి ప్రభుత్వం : ఎమ్మెల్యే

చెన్నూరు, సెప్టెంబరు 21: ఆర్థిక సంక్షోభంలోనూ అద్భుత పాలన అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. శనివారం ఉప్పరపల్లెలో ‘ఇది మంచి ప్రభుత్వం.. ఎందుకంటే..’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 16437ఖాళీలకు మెగా డీఎస్సీ నిర్వహించేందుకు సంతకం చేయడంతో పాటు జూలై 1 నుంచే పింఛను రూ.4వేలు పెంచి అందిస్తున్న గొప్ప నేత చంద్రబాబు అన్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్లను పునఃప్రాంరభించారన్నారు. చెన్నూరు మండలానికి కూడా అన్నక్యాంటిన మంజూరైందని, త్వరలో ప్రారంభిస్తామన్నారు. ల్యాండ్‌ టైటలింగ్‌యాక్ట్‌ రద్దు చేసి రైతుల్లో మనోధైర్యం నింపారన్నారు. చెన్నూరుకు రూ.4కోట్లు, ఉప్పరపల్లె పంచాయతీకి 40 లక్షలు మంజూరైందన్నారు. నాయకులు ప్రజలకు చేరువై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడకు కేంద్ర ప్రభుత్వం రూ.2300 కోట్లను మంజూరు చేసిందని, ఇది చంద్రబాబు ఘనతేనన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 54 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. జీఎనఎ్‌సఎ్‌స ద్వారా నీరు వస్తుందని, ఫలితంగా నియోజకవర్గంలోని ఆ రు మండలాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. కమలాపురం నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలపాలన్నదే తన ధ్యేయమన్నారు. టీడీపీ సీనియర్‌ నేతలు రామకోటిరెడ్డి, రామచంద్రారెడ్డి, మండల ప్రత్యేక అధికారి పరిమళ జ్యోతి, తహసీల్దారు ఆలీఖాన, ఈఓఆర్‌డీ సురేశబాబు, ఎంఈఓ గంగిరెడ్డి, గ్రంధాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన జి.రామకోటిరెడ్డి, తెలుగు యువత మండల నాయకులు రామచంద్రారెడ్డి, నరసారెడ్డిపల్లె చంద్ర, గుణ, మండల కన్వీనరు విజయభాస్కర్‌రెడ్డి, క్లస్టర్‌ ఇనచార్జ్‌ బుజ్జన్న, టీడీపీ సీనియర్‌ నేతలు వీరభద్రారెడ్డి, ఇందిరెడ్డిశివారెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, షబ్బీర్‌హుసేన, మన్నూరు అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణాంధ్ర 2047 విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే

కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 21 : ఆంధ్రప్రదేశ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభలను విజయవంతం చేసి చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047ను విజయవంతం చేద్దామని కడప ఎమ్మెల్యే మాధవి పిలుపునిచ్చారు. శనివారం పాతకడప టూరిజం భవనంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషన రు వైఓ నందన, అడిషనల్‌ కమిషరు రాకేశచంద్రం, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

20వ డివిజనలో.. కడప నగరం 20వ డివిజన మారు తీనగర్‌లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్య క్ర మంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొని మాట్లాడారు. ఈ కా ర్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు

దేవునికడప సచివాలయంలో మున్సిపల్‌ కార్పొరేషన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సమావేశంలో స్థానిక ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యే మాధవి దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ధ్యేయం: బీటెక్‌ రవి

లింగాల, సెప్టెంబరు 21: ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారని పులివెందుల టీడీపీ ఇనచార్జి మా రెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి) అన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి గా అమలు చేస్తున్నామన్నారు. మండలంలోని లోపట్నూతల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఇది మన ప్రభుత్వం కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలతో మాట్లాడారు. వంద రోజుల్లోనే ప్రభుత్వం సాధించిన అంశాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుంటు న్నా మన్నారు. పోలవరానికి రూ.12500 కోట్లు కేంద్ర ప్రభు త్వం నుంచి గ్రాంట్‌ తెప్పించడం టీడీపీ ప్రభుత్వ ఘనత అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచుగా చెక్‌పవర్‌ ఉండేదా అని ప్రశ్నించారు. ఒక్క రూపాయి అయిన డ్రా చేసిందా అని ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1459కోట్లు పంచాయతీ రాజ్‌ ద్వారా సర్పంచుల అకౌంట్‌లకు వేసి గ్రామాలను మెరుగుపరచాలని చెప్పా రన్నారు. అనంతరం ఆయనకు ప్రజలు అర్జీలు సమర్పించి సమస్యలను చెప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లోకేశ్వర్‌రావు, డీటీ త్రిభువనరెడ్డి, ఎస్‌ఐ మధుసూధనరావు పాల్గొన్నారు.

ఇది సంక్షేమ ప్రభుత్వం

వేముల, సెప్టెంబరు 21: కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారధిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దుగ్గన్నగారిపల్లె, పెద్దజూటూరు, చింతలజూటూరు గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీకాంతరెడ్డి, గంగాదర్‌రెడ్డి, వసంతరెడ్డి పాల్గొన్నారు.

అధికారులు విఫలం

దుగ్గన్నగారిపల్లెలో ఏర్పాటుచేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 11గంటలు అయినా పంచాయతీ కార్యాలయం తెరవలేదు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ప్ర జలు, నాయకులు కార్యాలయం బయట వేచి ఉన్నారు.

సింహాద్రిపురం: మండలంలోని గురిజాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నేతలు, అధికారులు గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. పులివెందుల టీడీపీ సీనియర్‌ నేత, వేంపల్లి మండల టీడీపీ పరిశీలకులు అజ్జగట్టు రఘునాథరెడ్డి చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Updated Date - Sep 21 , 2024 | 11:55 PM