కదలని చెరువు కట్ట విస్తరణ
ABN, Publish Date - Nov 30 , 2024 | 11:53 PM
పెద్దమండ్యం మండలం పాపేపల్లి గ్రామ పంచాయతీ గుడి సెవారిపల్లి చెరువు కట్ట విస్తరణ పనులు ముందుకు సాగడంలేదు.
పెద్దమండ్యం, నవంబరు 30(ఆంధ్ర జ్యోతి): పెద్దమండ్యం మండలం పాపేపల్లి గ్రామ పంచాయతీ గుడి సెవారిపల్లి చెరువు కట్ట విస్తరణ పనులు ముందుకు సాగడంలేదు. జిల్లా కలెక్టర్ చాకూరి శ్రీధర్ ఆదే శాల మేరకు నెల రోజుల క్రితం ప్రా రంభమైన పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో మళ్లీ ఎప్పుడు మొద లవుతాయని స్థానికులు ప్రశ్నిస్తున్నా రు. వివరాల్లో వెలితే ఈ ఏడాది సెప్టెంబరు 9వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా గుడిసెవారిపల్లి చెరువు కట్టపై ట్రా క్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పి. తుర కపల్లి కు చెందిన ఎస్. మౌలా కొడు కు అప్జల్ (11) మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చామ కూరి శ్రీధర్ సెప్టెంబరు 10వ తేదీన గుడిసెవారిపల్లి చెరువుకట్ట వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని పరి శీ లించి చెరువు కట్ట దారిపై వాహనా ల రాకపోకలకు ఇబ్బందులు కలుగ కుండా కట్ట విస్తరణ అభివృద్ధి పను లకు ఇరిగేషన, ఉపాధి పథకం ద్వా రా సుమారు రూ. 40 లక్షల నిధు లు మంజూరు చేశారు. దీంతో గత ఒకన్నర నెల క్రితం రూ.. 40 లక్షల నిధులతో గుడిసెవారిపల్లి చెరువు కట్ట విస్తరణ అభివృద్ధి పనులను అధికారులు, కూటమి నేతలు శ్రీకా రం చుట్టారు. చెరువు కట్టప్రాం తంలో కంప చెట్లు తొలగించి కొంత మేర మట్టి పనులు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత చెరువు కట్ట విస్తరణ పనులు ఆగి పోయాయి. నిలిచిపోయిన పనులను వెంటనే చేపట్టాలని గుడి సెవారిపల్లి, పి. తురకపల్లి గ్రామస్థులు కోరుతు న్నా రు. వర్షాల కారణంగా చెరువు నిండి తే చెరువు కట్ట అభివృద్ధి పనులు ఆగిపోతాయని వారు ఆంధోళన వ్య క్తం చేశారు. మరో పక్క చెరువు కట్టకు వేసిన కట్టరాళ్లు తొలింపుతో కట్ట బలహీన పడిందని భారీ వర్షం కురిస్తే కట్ట తెగే ప్రమాదం ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.
నీటి సంఘాల ఎన్నికలతో జాప్యం
సాగునీటి సంఘాల ఎన్నికల విధుల్లో ఉండడంతో పనులు ఆలస్య మయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేర కు గుడిసెవారిపల్లి చెరువుకట్ట విస్త రణ అభివృద్ధి పనులు ప్రారంభిం చాం. మట్టి పనులు కూడ జరిగా యి. రోడ్డు రోలర్ రాగానే పనులు ప్రారంభం అవుతాయి.
-శ్రీనివాసులురెడ్డి,
ఇరిగేషన ఇనచార్జ్ ఏఈ
Updated Date - Nov 30 , 2024 | 11:53 PM