ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

ABN, Publish Date - Sep 17 , 2024 | 11:33 PM

కోట్లాది రూపాయల విలువజేసే మా భూములకు మెరుగైన పరిహారం అందే వరకు రోడ్డు పనులు చేయనీయమంటూ పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన ఇద్దరు రైతు లు భీష్మించుకోవడంతో మంగళవారం పీలేరులో ఉద్రిక్తత నెలకొంది.

ఎనహెచ అధికారులు, పోలీసులతో మాట్లాడుతున్న రైతులు

పీలేరు, సెప్టెంబరు 17: కోట్లాది రూపాయల విలువజేసే మా భూములకు మెరుగైన పరిహారం అందే వరకు రోడ్డు పనులు చేయనీయమంటూ పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన ఇద్దరు రైతు లు భీష్మించుకోవడంతో మంగళవారం పీలేరులో ఉద్రిక్తత నెలకొంది. వారిలో పీలేరు బార్‌ అసోసియేషన అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి సర్వే నెం.157లో 1.60 ఎకరాలు, తపాలా శాఖ మాజీ ఉద్యోగి అమరనాథరెడ్డికి సర్వే నెం.260/1లో 18 సెంట్ల భూమి రోడ్డు విస్తరణ కోసం ఎనహెచ అధికారులు తీసుకున్నారు. అప్ప ట్లో పురుషోత్తంరెడ్డికి రూ.11 లక్షలు, అమరనాథరెడ్డికి రూ.5 లక్ష లు పరిహారంగా మంజూరు చేశారు. అయితే పీలేరు పట్టణానికి అతి సమీపంలో ఉన్న తమ భూములు కోట్లాది రూపాయల విలువ చేస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ఎనహెచ అధికారులు మంగళవారం వారిద్దరి భూముల్లో పనులు ప్రారంభించగా వారు అడ్డుకోవడంతో ఎనహెచ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని బందోబస్తు నడుమ పనులు ప్రారంభించారు. అయితే తాము మాత్రం మెరుగైన పరిహారం కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 11:33 PM

Advertising
Advertising