రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలి
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:07 AM
రైతులు వ్యవసా యంలో సాంకేతిక పరిజ్ఞానా న్ని అలవర్చుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానా యక్ సూచించారు.
పెద్దతిప్పసముద్రం/కురబల కోట, నవంబర్ 19 (ఆంధ్ర జ్యోతి) : రైతులు వ్యవసా యంలో సాంకేతిక పరిజ్ఞానా న్ని అలవర్చుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానా యక్ సూచించారు. మంగళ వార పీటీఎం మండలంలోని తుమ్మరకుంట గ్రామంలో నిర్వ హించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆయన పలు పంటలను పరిశీలించారు. ఈ సంద ర్బంగా ఆయన రైతులతో మాట్లాడుతూ పంట మార్పిడి విధానం తప్పనిసరన్నారు. వేరుశనగ పంటలకు జిప్సం తప్పకుండా వాడుకోవాలన్నారు. రబీ పంటలకు సం బంధించి పంటబీమా రైతులు టమోటా ఎకరాకు 1600, వరికి 126, వేరుశనగకు 96 రూపాయల వంతున ప్రీమియం డిసెంబర్ నెలాఖరులోగా చెల్లించాలన్నారు. కార్యక్ర మంలో మండల వ్యవసాయాధికారిణి ప్రేమలత, రైతుసేవాకేంద్రం సిబ్బందితో పాటు తుమ్మరకుంట గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులు బీమాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. మంగళవారం కురబలకోట మండలంలోని ముదివేడు, పిచ్చలవాండ్లపల్లె గ్రామాల్లో పొలం పిలు స్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రబీ పంటలైన టమోటా, వరి, వేరుశనగా పంటలపై భీమా సౌకర్మాన్ని కల్పిస్తుం దని దీనిపై రైతులు అగాహన పెంచుకో వాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఏడీ శివశంకర్, ఏవో. రాధ, శాస్త్రవేత్తలు శ్రీనిసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:07 AM