ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు భూమి ఇచ్చే వరకు పోరాటం: సీపీఐ

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:46 PM

పేదలకు సాగు భూమి ఇచ్చే వరకు పోరాటం ఆ గదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు.

ధర్నాలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర

పులివెందుల టౌన, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పేదలకు సాగు భూమి ఇచ్చే వరకు పోరాటం ఆ గదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. సో మవారం పులివెందుల ఆర్డీఓ కా ర్యాలయం వద్ద ఏపీ గిరిజన సమాఖ్య ఏపీజీఎస్‌, దళితుల పోరాట సమితి, దళిత, డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం లో పులివెందుల రెవెన్యూ డివిజను పరిధిలోని 8 మండలాల్లోని సాగుభూమికి అర్హులైన వా రంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ అధికారులు విలువైన ప్రభుత్వ, వంక, వాగు, రస్తా చెరువు, వక్ఫ్‌, ఇనాం భూములను కట్టబెట్టి కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారన్నారు. పేదలకు రెండు ఎకరాల సా గు భూమి మంజూరు చేయాలన్నా రు. పులివెందుల ప్రాంతంలో గతంలో పోరాడి సాధించుకున్న ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ను ఉల్లం ఘిస్తున్నారన్నారు. పాలక ప్రభుత్వాలకు బుద్ధి రావాలంటే పోరాటమే శరణ్యమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి మండలం లో, ప్రతి గ్రామంలో అర్హులైన పేదల జాబి తాను సిద్ధం చేయాలన్నారు. ఆ జాబితాలను అసైన్డ కమిటీకి సిఫార్సు చేయాలని డిమాండ్‌ చేశారు.లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి శంకరనాయక్‌, దళిత హ క్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మునెయ్య, దళిత, డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వర్‌రావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేసీ బాదుల్లా, పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకటరాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:46 PM