ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్రీహోల్డ్‌.. భూదందా

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:25 AM

జగన ఐదేళ్ల పాలన జనాలకు పీడకల లాంటిది. అప్పట్లో కొందరు వైసీపీ నేతలు తోడేళ్లు, భూరాబందులుగా మారి ఇసుకను కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూములను లాగేసుకున్నారు. వాగు, వంక మాత్రమే కాదు.. చివరికి ప్రైవేటు భూములకు సంబంధించి కూడా బెదిరించి సొమ్ము చేసుకున్నారు. సెటిల్‌మెంట్లలో తేడా రావడంతో వైసీపీ గ్యాంగే సొంత పార్టీ నేత శ్రీనివాసరెడ్డిని పట్టపగలు

విలువైన భూముల స్వాహాకు..

వైసీపీ నేతల పక్కా స్కెచ

నిబంధనలకు నీళ్లు

విచారణలో వైసీపీ నేతల భూభాగోతం బట్టబయలు

నిబంధనలకు విరుద్ధంగా 9వేల ఎకరాలు ఫ్రీహోల్డ్‌లోకి

జగన ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్‌ పేరిట విలువైన భూములు వైసీపీ నేతలకు అధికారికంగాభూసంతర్పణ చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో 76,275.24 ఎకరాలు ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వస్తాయి. ఇందులో 9,004.12 ఎకరాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ వైసీపీ నేతల ముఖ్యఅనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అంటున్నారు. ఇక జగన సొంత జిల్లా కావడంతో అప్పటి అఽఽధికారులు కూడా వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా పనిచేశారు. ఫ్రీహోల్డ్‌ భూములపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వైసీపీ నేతల మాయాజాలం ఇప్పుడు బయటికి వస్తోంది.

(కడప-ఆంధ్రజ్యోతి): జగన ఐదేళ్ల పాలన జనాలకు పీడకల లాంటిది. అప్పట్లో కొందరు వైసీపీ నేతలు తోడేళ్లు, భూరాబందులుగా మారి ఇసుకను కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూములను లాగేసుకున్నారు. వాగు, వంక మాత్రమే కాదు.. చివరికి ప్రైవేటు భూములకు సంబంధించి కూడా బెదిరించి సొమ్ము చేసుకున్నారు. సెటిల్‌మెంట్లలో తేడా రావడంతో వైసీపీ గ్యాంగే సొంత పార్టీ నేత శ్రీనివాసరెడ్డిని పట్టపగలు నట్టనడిరోడ్డులో కత్తులతో హతమార్చారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా మరింత అక్రమాలకు తెర లేపారు. సమయం లేదు మిత్రమా.. అన్నట్లుగా రెవెన్యూ అధికారులపై వత్తిడి తెచ్చి అడ్డదారులు తొక్కారు. వైసీపీ నేతలు అక్రమంగా కొట్టేసిన భూములను ఫ్రీహోల్డ్‌ పేరిట సక్రమం చేసేసుకున్నారు.

వైసీపీ నేతలకు లబ్ధి

రివర్స్‌ పానలతో ప్రజలకు నరకం చూపిన జగన.. గత ఎన్నికల్లో లబ్ధికోసం నిషిద్ధ జాబితా నుంచి అసైన్డ భూములను తొలగిస్తామని ప్రకటించారు. దీనివల్ల రైతులు రిజిసే్ట్రషన చేసుకోవచ్చు. అంటే క్రయవిక్రయాలు జరుపుకోవచ్చన్నమాట. అప్పటికే చాలాచోట్ల అసైన్డ భూములను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. వాటన్నింటినీ ఫ్రీహోల్డ్‌ పేరిట కొట్టేసేందుకు పక్కాస్కెచ వేశారు. ఇందులో భాగంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అసైన్డ భూములను జగన సర్కారు 22ఎ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూన 30 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ఫ్రీహోల్డ్‌ కిందకు తీసుకు వచ్చింది. అంటే 2003 మునుపు అసైనమెంటు కింద తీసుకున్న వారి భూములన్నీ ఫ్రీహోల్డ్‌లోకి వస్తాయి. నిబంధనల ప్రకారం ఆనలైనలో పట్టాదారుడు లేదా వారసుడి పేరుండాలి. అవి సాగులో ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో ఉంటే ఆ భూములను ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే ఎన్నికల ముంగిట ఫ్రీహోల్డ్‌ పేరిట భారీ ఎత్తున వైసీపీ నేతలే విలువైన భూములు కొట్టేశారు.

రూల్స్‌ తుంగలో తొక్కి..

జిల్లాలో 7,6275.24 ఎకరాలను ఫ్రీహోల్డ్‌కి తీసుకువచ్చారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజనులో అసైన్డభూములు, చుక్కలు, ఇనాంలు కలుపుకుని 25,907.62 ఎకరాలు, పులివెందులలో 23,724.27, బద్వేలులో 15,88.17, కడపలో 10,755.18 ఎకరాలు.. మొత్తం 76275.24 ఎకరాలు ఫ్రీహోల్డ్‌లోకి వచ్చాయి. వీటన్నింటికీ 2023 జూన 30 నాటికి పట్టా తీసుకుని 20 ఏళ్లు అయి ఉండాలి. ఎవరి పేరుతో గతంలో పట్టా ఇచ్చారో వారి పేరే ఉండాలి. లేదంటే వారి వారసుల పేరు ఉండాలి. ఆనలైనలో, రికార్డుల్లో వారే ఉండాలి, ఆ భూములను మాత్రమే ఫ్రీహోల్డ్‌ కిందకు తేవాల్సి ఉంది. అయితే వైసీపీ నేతల ప్రభావంతో రూల్స్‌ మారిపోయాయి. 20 ఏళ్లు పూర్తి కాని విలువైన భూములను ఫ్రీహోల్డ్‌లోకి తీసుకువచ్చారు. ఆనలైనలో పేరు ఒకటి ఉంది, సాగులో మరొకరు ఉన్నారు. అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములు కూడా వచ్చాయి. అదెలా అంటే ప్రభుత్వ భూములు వాగులు వంకలు కూడా ఫ్రీహోల్డ్‌లోకి తీసుకువచ్చారు. అప్పట్లోనే దీనిపై దుమారం రేగింది. కూటమి ప్రభుత్వం తాజాగా విచారణ చేపట్టడంతో వైసీపీ నేతల బండారం బట్టబయలవుతోంది.

విలువైన భూములు కొట్టేశారు

ఫ్రీహోల్డ్‌ భూముల్లో జరిగిన గోల్‌మాల్‌ గుట్టు రట్టుచేసేందుకు కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు మైదుకూరు మండలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ 2,666 ఎకరాలు ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వచ్చాయి. అయితే ఇక్కడ ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించగా ఫ్రీహోల్డ్‌లో ఉన్న లొసుగుల గుట్టు బయటికి వచ్చింది. మైదుకూరు మండలంలో ముంబై-క్రిష్ణపట్నం ప్రధాన రహదారి కూడా వెళుతుంది. అలాగే కడప-కర్నూలు, హైదరాబాదు రహదారి.. కొత్తగా బెంగళూరు-అమరావతి రోడ్డు ఇక్కడ నుంచే పోతున్నాయి. దీతో భూములకు మంచి డిమాండ్‌ ఉంది. ఎకరా తక్కువ అనుకున్నా అంటే రూ.20లక్షలకు పైమాటే. తెలుగుగంగ కాల్వల భూములు, జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు, బద్వేలు రోడ్డులో పరిశ్రమల శాఖ ఇచ్చిన భూములు కూడా ఫ్రీహోల్డ్‌ చేశారు. అంటే ఈ భూములను వైసీపీ నేతలు కొనడంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అంటే అగ్రిమెంటు కొనుగోలులో ఉన్న విలువైన భూములను ఫ్రీహోల్డ్‌ పేరుతో రిజిస్ర్టేషనకు ఓకే చేశారు. ఇక్కడ అక్రమాలు జరిగినట్టు విచారణలో తేలడంతో తహశీల్దారుతో పాటు పది రెవెన్యూ సిబ్బందికి అధికారులు నోటీసులు ఇచ్చారు.


కదులుతున్న డొంక

భూములు కొట్టేయడంలో వైసీపీ బ్యాచకు ఉన్న టాలెంట్‌ మరెవరకీ లేదంటారు. కలసపాడు, వీఎనపల్లె, చక్రాయపేట, కడప, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం మరికొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన భూములు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చినవి 9,004.12 ఎకరాలు. ఇవన్నీ జగన ప్రభుత్వ నిబంధనల మేరకు వైసీపీ నేతలకు కట్టబెట్టారు. వీటిల్లో 300 ఎకరాలకు పైగా భూములు రిజిసే్ట్రషన్లు జరిగాయి. అయితే ఫ్రీహోల్డ్‌ భూములపై ప్రభుత్వం సీరియస్‌ కావడంతో పాటు రిజిసే్ట్రషన్లను రద్దు చేసింది. ఇప్పుడు విచారణ జరుగుతోంది. విచారణ పూర్తయితే మరెన్ని వేల ఎకరాల వైసీపీ భూరాబందుల చేతుల్లోంచి బయటకు వస్తాయో తెలుస్తుంది.

డివిజన్ల వారీగా..

- జమ్మలమడుగు రెవెన్యూ డివిజనులో రెవెన్యూ రికార్డులు, ఆనలైన పొజిషన, సాగులో వేరేవారు ఉన్న భూములను 1775.95 ఎకరాలను ఫ్రీహోల్డ్‌లో చేర్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం. వీటిలో అసైన్డ భూములు 165.70 ఎకరాలు ఉంటే చుక్కల భూములు 1610.25 ఎకరాలు ఉన్నాయి.

- బద్వేలు రెవెన్యూ డివిజనులో అసైన్డ భూమలుఉ 1468.41 ఎకరాలు, చుక్కల భూములు 20.23, ఇనాంభూములు 647.1.. మొత్తం 2135.74 ఎకరాలు గుర్తించారు.

- కడప రెవెన్యూ డివిజనులో అసైన్డ భూములు 407.99 ఎకరాలు, చుక్కల భూములు 2030.63.. మొత్తం 2438.62 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌లో చేర్చారు.

పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం

- అదితిసింగ్‌, జాయింట్‌ కలెక్టర్‌

ఫ్రీహోల్డ్‌ భూములపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాం. మైదుకూరు మండలాన్ని ప్రయోగాత్మకంగా తీసుకున్నాం. అక్కడ ఫ్రీహోల్డ్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. ఈ నెల 15లోపు ఎంక్వయిరీ పూర్తవుతుంది. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం.

Updated Date - Nov 11 , 2024 | 12:25 AM