సమస్యల వలయంలో ప్రభుత్వ పీహెచసీలు
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:03 AM
మదనపల్లె, తంబళ్లపల్లె నియో జకవర్గాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలతో సతమతమవుతున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత.. పరికరాలలేమి
శిథిలావస్థలో కలకడ, వాల్మీకిపురం ఉపకేంద్రాలు
మదనపల్లె, అర్బన, టౌన, బి.కొత్తకోట, ములకలచె రువు, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, నిమ్మన పల్లె, రామసముద్రం, పెద్దమండ్యం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మదనపల్లె, తంబళ్లపల్లె నియో జకవర్గాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఆసుపత్రులలో తగినట్లు వైద్యులు, సిబ్బంది లేరు. ముఖ్యంగా వ్యాధిని నిర్ధా రించే వైద్య పరికరాలైన స్కానింగ్, ఎక్స్‌రే యం త్రాలు అందుబాటులో లేవు. కొన్ని చోట్లా అవి ఉన్నా రిపేర్లతో పక్కన పడేశారు. ఆసుప త్రుల లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇబ్బం దులపైన మంగళవారం ఆంధ్రజ్యోతి ఆనలైన విజిట్‌లో పలు విషయాలు వెల్లడయ్యాయి.
ఫమదనపల్లె జిల్లా ఆసుపత్రిలో నెలరోజులుగా ఎక్స్‌రే యంత్రం పనిచేయడం లేదు. అందుకు కావాల్సిన పరికరానికి ప్రభుత్వానికి ఆర్డర్ పెట్టగా, ఇంకా రాలేదని వైద్యులు చెబుతున్నారు. ఎక్స్‌రే అవసరమయ్యే రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో వారంతా బయట ప్రవేటు సెంట ర్లకు వెళ్లి తీసుకుంటున్నారు. అలాగే ఆపరేషన థియేటర్‌లో ఏసీ లేకపోవడంతో అటు వైద్యులు, ఇటు రోగులు ఇబ్బంది పడుతున్నారు.
ఫమదనపల్లె మండలం సీటీఎం, బొమ్మన చెరు వులలో పీహెచసీ కేంద్రాలకు వచ్చే రోగులకు సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. పీహెచసీ ఊరి కి దూరంగా ఉండటంతో సిబ్బంది రాత్రివేళల్లో విధులకు వెళ్లడానికి భయపడు తున్నారు. ఇక్కడ వైద్య సిబ్బందే కాదు..అటెండర్, వాచమెన కూడా లేరు. స్టాఫ్ నర్సుపోస్టు ఖాళీగా ఉంది. ఆసుపత్రి అభివృద్ధి నిధులు గతంలో రూ.1.75లక్షలు వస్తుం డగా, ప్రస్తుతం రూ.85వేలే వస్తున్నాయి.
ఫ బి.కొత్తకోట పీహెచసీ 30 పడకల నుంచి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌గా అప్‌గ్రేడ్ అయింది. దానికి తగినట్లు సిబ్బంది, ఇతర పరికరాలు లేవు. మహిళలకు స్కానింగ్, ఎక్స్‌రే పరికరాలు లేవు. రోజుకు సుమారు 300 నుంచి 400 మంది ఓపీ రోగులు వస్తున్నారు. రాష్ట్రంలోనే ఇక్కడి పీహెచ సీ రెండోస్థానంలో ఉండగా, ఆ స్థాయిలో రోగు లకు వైద్యసేవలు అందడం లేదు.
ఫపెద్దమండ్యం పీహెచసీలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. పీటీఎం పీహెచసీలో సిబ్బంది కొర త రోగులను వేధిస్తోంది. ఇక్కడహెల్త్ ఎడ్యుకేట ర్(హెచఈ)గా పనిచేస్తున్న సరస్వతి బదిలీ కావ డంతో ఆ పోస్టు ఖాళీగా వుంది.
ఫ రామసముద్రంలో కుక్కకాటు, పాముకాటుతో సహా 163 రకాల మందులు అందుబాటులో ఉన్న ట్లు డాక్టర్లు చెబుతున్నారు. వైద్యులు, సిబ్బంది నివాస భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి.
ఫ నిమ్మనపల్లె పీహెచసీలో ఇద్దరి బదులు ఒకరే వైద్యుడు ఉన్నారు. మరొకరు డిప్యూటేషనపై మద న పల్లెకు బదిలీపై వెళ్లారు.
ఫములకలచెరువు పీహెచసీలో ఉదయం 11గం టలైనా వైద్యులు రాలేదు. ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండాల్సిఉండగా, ఒకరు మెటర్నరీ సెలవులో వెళ్లగా, ఇంకొకరు 104 సేవలకు వెళ్లినట్లు చెప్పా రు. దీంతో రోగులకు బయట సిబ్బంది చికిత్స చేసి పంపారు.
ఫతంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పీహెచ సీలో కొన్ని ఏళ్లుగా స్టాఫ్‌నర్సు పోస్టు ఖాళీగా ఉంది. కమ్యూనిటీ హెల్త్ హెల్త్ ఆఫీసర్ గతే డా ది రిటైర్డ్ కాగా, ఆ పోస్టు ఇప్పటికీ ఖాళీగా ఉంది.
పీలేరు ఆసుపత్రిలో నీటి కొరత!
పీలేరు/వాల్మీకిపురం/కలకడ/కలికిరి/గుర్రంకొండ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): పీలేరు పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో నీటి కొరత వేధిస్తోంది. నూతన భవనంలో నడుస్తున్న ఈ ఆసుపత్రిలో సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నా ఆసుప త్రి ఆవరణలో నిర్మించిన ఆక్సిజన ప్లాంటుకు సప్లై పైపులను అమర్చాల్సి ఉంది. ఆసుపత్రికి ప్రభు త్వం అందజేసే మందులను సురక్షితంగా పెట్టుకో వడానికి ప్రత్యేకంగా గది నిర్మించాల్సి ఉంది. అదే విధంగా బయో మెడికల్ వేస్ట్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో 21 మంది వైద్యులు, 29 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఒక రేడియాలజిస్టు, ఒక జనరల్ మెడిసిన వైద్యుడి పోస్టు ఖాళీగా ఉన్నాయి. సగ టున ప్రతిరోజూ పీలేరు ఆసుపత్రికి 700 మంది పేషెంట్లు వస్తుంటారు. ఆసుపత్రిలో నెలకు 70 వివిధ ఆపరేషన్లు చేస్తున్నారు. ఆసుపత్రికి ప్రహరీ నిర్మించాలని వైద్యులు కోరుతున్నారు. అయితే పీలేరు పట్టణానికి ఆనుకుని రెండు జాతీయ రహదారులు ఉండగా, పీలేరు ఆసుపత్రిలో ఒక ఆక్సిడెంట్ ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పదేళ్లుగా ఆచరణకు నోచుకోవడం లేదు.
ఫ కలకడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఏఎనఎం పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ పని చేస్తున్న ఏఎనఎం డిప్యూటేషనపై వెళ్లడంతో అత్య వసర సమయాల్లో ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. ఇక కలకడ పీహెచసీ ఉపకేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుంది. దానికి తోడు ఊర్లోని చెత్తాచెదరాన్ని అందులో వేస్తుండడం తో అది పాములకు నిలయమంగా మారింది.
ఫ వాల్మీకిపురం మండలంలో ని వాల్మీకిపురం , చింతపర్తి లోని పీహెచసీలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు బాగా నే అందుతున్నాయి. చింతపర్తి పీహెచసీ ఆవరణలోని క్వార్ట ర్స్ శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉన్నాయి.
ఫ గుర్రంకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత ఉంది. ఈ ఆసుపత్రి 24 గంటల ఆసుపత్రి కావడంతో రాత్రి పూట కాన్పుల కేసులు వస్తే సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు స్టాప్ నర్సులు ఉండా ల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు.వీరు రాత్రి పూట విదులకు వచ్చి వెళుతుండడంతో ఉదయం ఓపీ సమయంలో రోగులు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండిపో యాయి.
ఫకలికిరి సీహెచసీలో నీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకులు నిరర్థకంగా పడిఉ న్నాయి. అంతర్జాతీ య సంస్థ యునిసెఫ్ రెండు నీటి ట్యాంకులను అందుబాటులో ఉంచినా అవి వాడటానికి పనికి రాకుండా పోయాయి. రోజూ దాదాపు 200 మంది కి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. వారికి చిన్న ట్యాంకులు అయితే నీరు సరిపోతుంది.
Updated Date - Nov 20 , 2024 | 12:03 AM