ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Apr 20 , 2024 | 11:30 PM

టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు.

కురబలకోటలో చంద్రబాబు జన్మదిన వేడుకలలో కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి తదితరులు కలకడలో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి కేక్‌ తినిపిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 20: టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. శనివారం మదనపల్లె టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి షాజహానబాషా స్థానిక సుభాష్‌రోడ్డులోని ఆయన నివాసం వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు ఎస్‌ఏ మస్తాన, నాదెళ్ల శివన్న, ఆర్‌కే రామకృష్ణాచారి, శివప్రసాద్‌, సంగంం శ్రీనివాసులు, ఎస్‌ఎం రఫి, తులసి, నీలకంఠ, జేసీబీ ఈశ్వర, మధు, వేణు, జీవీ నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయురారోగ్యా లతో వర్థిల్లాలని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెం కటేశ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను సందర్భంగా కేక్‌కట్‌ చేసి టీడీపీ నాయకులకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివాళా తీస్తున్న రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాల న్నారు. కార్యక్ర మంలో విజయమ్మ, గండికోట గణేష్‌, రాటకొండ రాజేష్‌, ప్రణయ్‌ పాల్గొన్నారు.

పీలేరులో: తమ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడు కలను శనివారం పీలేరులోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరు పుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి తనయుడు నల్లారి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి తిరిగిగాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. పీలేరులో నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డిని, రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకు లు పురం రామ్మూర్తి, శ్రీనాథరెడ్డి, సురేంద్ర,లక్ష్మీకర, శివారెడ్డి, పురుషోత్తం రెడ్డి, గుర్రం నగేష్‌, లక్ష్మీకాంతమ్మ, హనీఫ్‌, ముబారక్‌, విజయ్‌, పఠాన మౌలా, రెడ్డిముని, వెంకటరమణ నాయక్‌, సురేశ, మల్లి, చిన్నా పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను శనివారం వాల్మీకిపురంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం స్థానిక చౌడేశ్వరిదేవి వృద్దాశ్రమంలో వృ ద్ధులకు పండ్లు, రొట్టెలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్ర మంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, నాయకులు గాంధీపేట రమణ, పీవీ నారాయణ, రాజేంద్రాచారి, సురేంద్రవర్మ, వల్లిగట్ల వెంకటరమ ణ,చం ద్రమౌళి, కువైట్‌ బాబు, సయ్యద్‌బాషా, జావీద్‌ పాల్గొన్నారు.

నిమ్మనపల్లిలో: స్థానిక టీడీపీ కార్యాలంయంలో శనివారం టీడీపీ జాతీ య అధ్యక్షుడు నారాచద్రబాబునాయడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ప్ర తి కార్యకర్త సైనికుడిలా పని చేసి ఎమ్యెల్యే అభ్యర్థి షాజహనబాషాను గెలి పించి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో రాజన్న, రమణ, శ్రీపతి, మహమ్మద్‌ రఫి, శ్రీరాములు, మల్లికార్జున, రెడ్డెప్ప, శంకర, చెం డ్రాయుడు, ఖాసీమ్‌ఖాన, రమణ పాల్గొన్నారు.

గుర్రంకొండలో:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శనివారం ఆ పార్టీ నాయకులు గుర్రంకొండ లో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్‌కుమార్‌, మురళీ, చలమారెడ్డి, మేకల చలపతి, సుంకర శేఖర్‌, సుబ్బరాజు, రామాం జులు, చిన్న రెడ్డి, రంజిత, సురేంద్ర, సుధాకర్‌, మోహన పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: టీడీపీ జాతీయ అద్యక్షుడు, స్వర్ణాంద్ర సృష్టికర్త, నారా చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలను పీటీఎంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని టి.సదుం పంచాయతీ చెన్నరా యునిపల్లె క్రాస్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు బారీ కేక్‌ ను కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నాయకు లు ఆంద్ర రాష్ట్ర ప్రజల కోసం అలుపెరుగని పోరాట యోదుడిగా అహర్ని శలు శ్రమిస్తున్నారంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కురబలకోటలో: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని సీఎం చేయడమే ధ్యేయమని తంబళ్లపల్లె టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం చంద్రబాబునాయుడి జన్మదిన వేడుకలసందర్భంగా కేక్‌కట్‌ చేసి స్వీట్లు, పండ్లు పంచి పెట్టారు. నియోజక వర్గ పరిశీలకుడు సీడ్‌ మల్లికార్జున నాయుడు, రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌, కార్యదర్శి అయూబ్‌ బాషా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీనతాజ్‌, మండలాధ్యక్షుడు వైజీ సురేంద్ర, మాజీ ఎంపీపీ తిమ్మ రాయుడు, సూరి, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, మధుకర్‌ రెడ్డి, రెడ్డెప్ప, సోము, రామచంద్ర, రమేష్‌, లక్ష్మన్న, వెంక టరమణా రెడ్డి, మోహనరెడ్డి, భాస్కర్‌, ఆలం, సదాశివ, చంద్ర, శ్రీనివాసులు పాల్గొన్నారు.

కలకడలో:టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడు కల ను కలకడలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం లో పార్టీ సీనియర్‌ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు మన పెద్దాయ నకు జన్మదిన శుభాకాంక్షలు అనే నినాదంతో ప్రత్యేకంగా తయారు చేయించిన 75 కిలోల కేక్‌ కట్‌ను కట్‌ చేసి నాయకులు తినిపించుకున్నారు.

చంద్రబాబుకు వీరాభిమాని దగ్గుబాటి

కలకడ, ఏప్రిల్‌ 20:టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుని ఆరాధ్య దైవంగా భావించే దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1992 నుంచి క్రమం తప్పకుం డా ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఏదో ఒక సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో హాజరై పార్టీ శ్రేణుల నడుమ పెద్దాయన వయస్సుకు సమాన బరువున్న కేక్‌ను కట్‌ చేయడం పరిపాటి. గతంలో చంద్ర బాబు జన్మదిన వేళ వాల్మీకీపురంలోని కోదండ రామాలయానికి రూ1.05 లక్షల విలువ చేసే బంగారు హారణి బహుకరించారు. ప్రతి ఏటా ఈ సంబరాల వేళ ఎన్టీఆర్‌ ట్రస్టుకు రూ.లక్ష వంతున విరాళాన్ని ఇస్తువ స్తున్నారు. అదే విధంగా సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తన కుమా రుడు పొందిన తొలి నెల జీతాన్ని ట్రస్ట్‌కు అందజేశారు. అలాగే 2018 నుంచి జననేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి జన్మదిన రోజైన సెప్టెంబరు 13వ తేదీ కూడా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించ డంలో ముందున్నారు. టీడీపీ అభివృద్దికి నిరంతరంగా కృషి చేస్తున్నారు. కార్యక్రమంలో నేతలే మల్లారపు రవిప్రకాశ, సూర్యప్రకాశ, పొత్తూరి ప్రభాకర్‌నాయుడు, శ్రీనివాసులరెడ్డి, తిరుపతినాయు డు, వెంకటరమణనాయుడు, కాంతారావు, పునీతచౌదరి, తారకేశ్వర, చంద్ర మోహన, త్యాగరాజు, శ్రీనివాసులనాయుడు, ఆనంద్‌నాయుడు, పీవీ నాయు డు, వసంతనాయుడు, రమణనాయుడు, వాటర్‌షెడ్‌ రవి, ఆనంద్‌రెడ్డి, జనార్ధన నాయుడు, చంద్రబాబునాయుడులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 11:30 PM

Advertising
Advertising