గుంతలమయం.. ఝరి రోడ్డు
ABN, Publish Date - Nov 03 , 2024 | 11:22 PM
మండలంలోని ఎర్రయ్యగారిపల్లె ఆర్చి నుంచి పలు గ్రామల మీదుగా ఝరి వరకు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది.
మట్టి కోసుకు పోయి, కంకర బయట పడి వాహనదారుల ఇక్కట్లు అవస్థల్లో పలుగ్రామాల ప్రజలు
కలకడ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రయ్యగారిపల్లె ఆర్చి నుంచి పలు గ్రామల మీదుగా ఝరి వరకు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. ఐదు కిలో మీటర్లు దూరం ఉన్న ఈ రహదారిపై సుమారు దశాబ్ధం క్రితం ప్రభుత్వం తారురోడ్డును నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రస్తుతం రోడ్డుపై గుంతలు పడడమే కాక వర్షాలకు అందులో నీరు నిలుస్తున్నాయి. అదేవిధంగా ఇరువైపులా మట్టి కోసుకపోయి కంకర బయట పడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణం చేసే ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంతేకాక వాహనాల రాకపోకలకు దుమ్ము లేచి విపరీతంగా అలుమకుంటుండంతో ప్రమాదాలు జరిగే అవకాశం వుంది. కారణంగా ఈ ఏడాది జరిగిన ఝరి ఉత్సవానికి హాజరైన వేలాది మంది భక్తులు ఇబ్బందిప డ్డారు. అంతేకాక ఈమార్గం కేవీపల్లె, సుండుపల్లె మండ లాల్లోని పలు గ్రామాలకు సౌకర్యంగా ఉన్నందున ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ కార్తీకమాసంలో ఝరిలో లక్షదీపోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పూజలకు అక్కడికి భక్తులు తరలి వెళతారు. సంబంధింత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టడంతోపాటు భవిష్యతలో సమస్యలు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Nov 03 , 2024 | 11:22 PM