హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం
ABN, Publish Date - Sep 26 , 2024 | 11:51 PM
రాష్ట్రంలోని పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
225.35 కిలోమీటర్లు.. రూ. 348 కోట్లు
దేవప్పకోట సమీపంలో పనులకు భూమి పూజ
భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
పెద్దతిప్పసముద్రం, సెప్టెంబరు 26 : రాష్ట్రంలోని పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మండలంలోని దేవప్పకోట పంచాయతీ సమీపంలోని దొరిగుండ్లపల్లెకు సమీపంలో కాలువ విస్తరణ పనులకు గురువారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ భూమి పూజ చేయగా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకుడు దాసరిపల్లె జయచంద్రారెడ్డి, ఎస్‌ఈ సీఆర్ రాజగోపాల్, మదనపల్లె సర్కిల్-3 అధికారి ప్రసాద్‌రెడ్డి, హంద్రీ-నీవా ఏఈ దేవపట్ల ఆంజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం హంద్రీ-నీవా కాలువల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.348 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హంద్రీ-నీవా కాలువలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేసిందని తెలిపారు. ఇటీవల జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తంబళ్లపల్లె నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్బంగా హంద్రీ-నీవా కాలువల స్థితిగతులను ఆయన దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆయన వెంటనే నిధులను విడుదల చేయడంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పెద్దతిప్పసముద్రం మండల సరిహద్దు గుడ్డంపల్లె నుంచి పీటీఎం, బి.కొత్తకోట, గట్టు, కురబలకోట, మదనపల్లె, పుంగనూరు మీదుగా పెద్దపంజాణి మండలం అప్పినపల్లె వరకు ఉన్న సుమారు 225.35 కిలోమీటర్ల వరకు ఉన్న హంద్రీ-నీవా కాలువను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి రైతులకు కాలువల ద్వారా నీరు అందించాలని హంద్రీ-నీవా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జనసేన తంబళ్లపల్లె ఇన్‌చార్జ్ పోతుల సాయినాథ్, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సీడ్ మల్లిఖార్జున నాయుడు, దేవప్పకోట టీడీపీ సర్పంచ్ అనితాసురేష్, టీడీపీ నాయకులు కట్టా సురేంద్ర నాయుడు, పులికల్లు మాజీ సర్పంచ్ కట్టా వెంకట్రమణనాయుడు, చంద్రమోహన్‌రెడ్డి, ముడుమూరు నవీన్, రమే్‌షరెడ్డి, సంపతికోట కిట్టన్న, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి తులసీధర్ నాయుడు, మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 26 , 2024 | 11:51 PM