ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సహకరించాలి
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:37 PM
మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమ స్య పరిష్కారానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే షాజహానబాషా కోరారు.
వ్యాపారులతో ఎమ్మెల్యే షాజహానబాషా
మదనపల్లె టౌన, నవంబరు4(ఆంధ్రజ్యో తి): మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమ స్య పరిష్కారానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే షాజహానబాషా కోరారు. సోమవారం స్థానిక సీటీఎం రోడ్డు లోని వ్యాపారులు, వాణిజ్య భవనాల య జమానులతో ఎమ్మెల్యే సమావేశమై మాట్లా డుతూ మదనపల్లె పట్టణంలో సీటీఎం రోడ్డు వ్యాపారాలకు ప్రాధానత్య గల ప్రాంతమని ఈ రోడ్డులో భారీ చింత వృక్షాలు రోడ్డు పక్కన ఉండటం, మిగిలిన రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మదనపల్లెకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లగా చింత చెట్లు తొలగించేందుకు అటవీశాఖ, ఆర్ అండ్‌బీ అధికారులతో చర్చించి అనుమతులు వచ్చాకే తొలగిస్తున్నామన్నారు. తనకు ఎవరి మీద విభేదాలు లేవని, రోడ్డును వెడల్పు చేస్తామే కాని, వ్యాపారుల భవనాలకు ఎలాంటి నష్టం వాటిళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ కొండయనాయుడు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటే పోలీసులు ఒక్కరితోనే సాధ్యం కాదని, ప్రజలు కూడా సహకరించనప్పుడే సమస్య పరిష్కరించవచ్చన్నారు. సీటీఎం రోడ్డులో వాహనాల పార్కింగ్ వల్ల ట్రాఫిక్ నిలిచిపోతోందన్నారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ వంక పక్కన పిల్లర్లు వేసి అక్కడ ప్లాట్‌ఫామ్ నిర్మించి వాహనాల పార్కిం గ్‌కు స్థలం చూపిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు విద్యాసాగర్, బాలు స్వామి, వ్యాపారులు విజయలక్ష్మి భాస్కర్, దేవత సతీష్, నంది బాబు, చెన్న కృష్ణారెడ్డి, బ్యాంకు భవనాల యజమానులు పాల్గొన్నారు.
Updated Date - Nov 04 , 2024 | 11:37 PM