ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేవదాయ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:48 PM

దేవదాయ శాఖ భూములను దురాక్రమ ణ చేస్తే కఠిన చర్యలు తప్ప వని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా హెచ్చరించా రు.

రామసముద్రం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ భూములను దురాక్రమ ణ చేస్తే కఠిన చర్యలు తప్ప వని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా హెచ్చరించా రు. మండలంలోని కురిజల గ్రా మంలో చెన్నకేశవస్వామి ఆల య భూమి వివాదాస్పదమైన విషయంపై గురువారం మండలానికి విచ్చే సిన ఎమ్మెల్యే గ్రామస్థులు, తహసీల్దార్‌, ఎస్‌ఐల సమక్షంలో విచారణ చేశా రు. ఆలయానికి చెందిన 1.6ఎకరాల భూమిని కురిజల గ్రామస్థుడు చెంగా రెడ్డి గత 30ఏళ్లుగా తన ఆధీనంలో ఉంచుకున్నట్లు గ్రామస్థులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేవదాయ శాఖాధికారులు వెంట నే ఆలయ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మండలంలోని ఆలయాలకు సంబంధించిన భూముల వివరాలు సేకరించి ఏవైనా దురాక్ర మణ జరిగింటే వాటిపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ నిర్మలాదే వికి సూచించారు. గ్రామాల్లో భూసమస్యలు ఉంటే శాంతియుత వాతావర ణంలో పరిష్కరించుకునేలా చూడాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మం డల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్‌గౌడు, మాజీ అధ్యక్షుడు కొండూరు నారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీలు మునివెంకటస్వామి, శివశంకర్‌, మాజీ సర్పంచ శివప్ప, మండల మాలమహానాడు అధ్యక్షుడు కృష్ణప్ప, ఏపీ మోడ ల్‌ స్కూల్‌ చైర్మన బాలాజీ, మండల వడ్డెర సంఘ అధ్యక్షుడు రెడ్డెప్ప, పలువురు కురిజల గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 11:48 PM