ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:41 PM

మదనపల్లె పట్టణం అభివృద్ధే ధ్యేయంగా తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

రాజకీయ విమర్శలు పట్టించుకోను ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మదనపల్లె పట్టణం అభివృద్ధే ధ్యేయంగా తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. కొందరు రాజకీయంగా విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా రని వాటిని తాను పట్ఠించుకోనని ఆయన స్ఫష్టం చేశారు. బుధవారం స్థాని క సీటీఎం రోడ్డు విస్తరణలో భాగంగా చింతచెట్లు తొలగిస్తున్న పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో వాణిజ్యకేంద్రమైన సీటీఎం రోడ్డులో 26 పాత చిం తచెట్లు ఉన్నాయని, ఏళ్లనాటి ఈ చెట్లలో కొన్ని కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల సబ్‌కలెక్టరేట్‌లో ఇలాంటి చింతచెట్టు కూలిపోయి ఒక వృద్ధుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అందుకే ఈ చెట్లను తొలగించ డంతో పాటు, రోడ్డు విస్తరణ చేస్తున్నామన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరితో కలసి పట్టణంలో ఇరుకైన రోడ్లలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అటవీశాఖ, ఆర్‌అండ్‌బీ శాఖ అనుమతులు తీసుకునే చింత చెట్లు తొలగిస్తున్నామన్నారు. కేవలం 19 అడుగుల వెడల్పు ఉన్న సీటీఎం రోడ్డు చింతచెట్లు తొలగించడంతో 60 అడుగుల వెడల్పు వస్తోంద న్నారు. ఇరువైపులా దుకాణాల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మధ్యలో డివైడర్‌ నిర్మించి, ఇరువైపులా వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు పుంగనూరు రోడ్డులోని మున్సి పల్‌ బోర్డు నుంచి కదిరి రోడ్డులోని నీరుగట్టువారిపల్లె వరకు ప్రభుత్వ భవ నాల స్థలాన్ని తీసుకుని రోడ్డు విస్తరణ చేస్తామన్నారు. టీడీపీ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ మస్తాన మాట్లాడుతూ మదనపల్లెలో ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోని రోడ్ల విస్తరణను షాజహానబాషా చేపట్టి సీఎం చంద్ర బాబు ఆశయాలకు అనుగుణంగా మున్సిపాలిటీలో గుంతలు లేని, వెడల్పైన రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. తంబళ్లపల్లె టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు మాట్లాడుతూ అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి కొంద రు వెన్నుపోటు రాజకీయాలు చేయడం తెలిసిందేనని, వాటిని పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్‌, మొటుకు శివ, ఎం.మధుసూధనరెడ్డి, గణపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:41 PM