ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:46 PM

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ ధనంజేయులు హెచ్చరించారు.

నిమ్మనపల్లి, నవంబరు 6(ఆం ధ్రజ్యోతి): ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ ధనంజేయులు హెచ్చరించారు. బుధవారం మండలంలోని స్థానిక పంచా యతి బోడిబండ సమీపంలో గల సర్వేనెంబరు.767లో 4.72 సెంట్ల వంక పొరంబోకు ప్రభు త్వ భూమిలో గత రెండు రోజు లుగా రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా మామాడి మొక్కలను నాటా డు. విషయం తెలుసుకొన్న రెవెన్యూ సిబ్బంది, పోలీసు బందోబస్తుతో ప్రభుత్వ భూమిలో నాటిన 60మామిడి మొక్కలను తొలగించారు. ఈ సందర్బంగా ఆర్‌ఐ అనంతలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటిన వ్యక్తులపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. అలాగే భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్ర మించుకొని కూసాలు నాటడంతో వాటిని కూడా తొలగించినట్లు తెలిపారు. మండ లంలో ప్రభుత్వ భూమును ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్ర మంలో సర్వేయర్‌ గోపినాధ్‌, వీఆర్వో రెడ్డిరాణి పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:46 PM