తెగుళ్లు నివారించకకుంటే రైతులకు తీవ్ర నష్టం
ABN, Publish Date - Sep 11 , 2024 | 12:39 AM
వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సీజనలో రైతులు తాము సాగు చేసిన పంటల్లో తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలని లేదంటే తీరని నష్టం తప్పదని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు అయితే నాగేశ్వర్‌రావు అన్నారు.
జేడీ నాగేశ్వరరావు
చెన్నూరు, సెప్టెంబరు 10 : వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సీజనలో రైతులు తాము సాగు చేసిన పంటల్లో తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలని లేదంటే తీరని నష్టం తప్పదని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు అయితే నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం చెన్నూరులోని మూడో రైతు భరోసా కేంద్రంతోపాటు రైతులు సాగు చేసిన పూలతోటలు, వరి పంటను పరిశీలించారు. రైతుభరోసా కేంద్రంలో ఈకేవైసీ ఎలా చేస్తున్నారు. ఈ నెల 15తేదీ చివరి తేది అని, ఆ రోజుకల్లా ఈకేవైసీని రైతులతో పూర్తిచేయించాలని చెప్పడం జరిగింది. అలాగే రైతులు సాగు చేసిన బంతిపూట తోటలను పరిశీలించి అక్కడ పురుగుల ఉధృతి తగ్గించి దిగుబడిసాధించేందుకు ట్రైకోడెర్మాను పశువుల ఎరువుతో కలిపి వేయడం వల్ల నాణ్యతతో పాటు సైజు పెరుగుతాయన్నారు. అలాగే వరిపంటలో పాము పొడ, అగ్గితెగులు రాకుండా సూడోమొనాస్ మందును లీటరునీటికి 10 గ్రా ములు చొప్పున కలిసి పిచికారి చేయాలన్నారు. అలాగే ఆకుముడత పురుగులకు మందును పిచికారి చేయాలన్నారు. ప్రతి రైతు ఈ సీజనలో పంటలు జాగ్రత్తగాకాపాడుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారిణి శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Sep 11 , 2024 | 12:39 AM