ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పు ఉంటే నిగ్గు తేల్చాలి

ABN, Publish Date - Aug 31 , 2024 | 11:56 PM

తన రాజకీయ జీవితంలో తనపై ప్రత్యర్థులు ఒక్కతప్పు వెతికినా కానరాదని వుంటే నిగ్గుతేల్చమని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఛాలెంజ్‌ విసిరారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుందూనదిలో మట్టి తోలుతూ పట్టుబడ్డ టిప్పర్లపై ఎన్‌వీఆర్‌ఆర్‌ అని వుంటే నంద్యాల వరదరాజులరెడ్డిదే నని బంగారురెడ్డి ఆరోపించారన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు ఆగస్టు 31 : తన రాజకీయ జీవితంలో తనపై ప్రత్యర్థులు ఒక్కతప్పు వెతికినా కానరాదని వుంటే నిగ్గుతేల్చమని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఛాలెంజ్‌ విసిరారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుందూనదిలో మట్టి తోలుతూ పట్టుబడ్డ టిప్పర్లపై ఎన్‌వీఆర్‌ఆర్‌ అని వుంటే నంద్యాల వరదరాజులరెడ్డిదే నని బంగారురెడ్డి ఆరోపించారన్నారు. నాపేరు గల వాళ్లు అనేక మంది వున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బంగారురెడ్డి కుందూలో మట్టిదోపిడీ చేశామనడం హాస్యాస్పదం అన్నారు. ఐదేళ్ళుగా పెన్నానదిలో ఇసుక, మట్టి, గుట్కా, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ ,జూదం నడిపింది రాచమల్లు ప్రసాద్‌రెడి,్డ ఆయన బావమరిది బంగారురెడ్డి అని దేశమంతా తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రొద్దుటూరులో ఎక్కడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగరాదని పోలీసులను ఆదేశించానన్నారు. ఎవ్వరు ఇసుక, మట్టి, గుట్కా, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, భూకబ్జాలకు పాల్పడినా వదలవద్దని ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వనని స్పష్టంగా చెప్పానన్నారు. అలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం ప్రోత్సహించడం కంటే రాజకీయాలను వదులు కోవడమే మేలని నమ్మే వాడినన్నారు. నిరంతరం మంచి కోరే నామీద రాచమల్లు, బంగారురెడ్డి ఎన్ని అవినీతి అక్రమాల గురించి ఆరోపించినా ప్రజలు నమ్మరన్నారు. ఎస్పీ జిల్లాలోని క్రికెట్‌ బుకీలు, జూదగాళ్ళను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారన్నారు.చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదని తప్పు చేసినవాడిని వదిలిపెట్టవద్దని పోలీసులకు స్పప్టంగా చెప్పనన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌ వెంకట కొండయ్య, టౌన్‌ బ్యాంకు చైర్మెన్‌ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 11:56 PM

Advertising
Advertising