టీడీపీ పాలనలో బీసీలకు పెద్దపీట
ABN, Publish Date - May 05 , 2024 | 11:50 PM
తెలుగుదే శం పార్టీ పాలనలో చంద్రబాబు నాయుడు బీసీలకు ప్రత్యేక కార్పొరేషన ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సం క్షేమ పథకాలు అమలు చేశారని రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణ మూర్తి, వాల్మీకి సంఘ అధ్యక్షుడు పొదల నరసింహులు పేర్కొన్నారు.
రామసముద్రం, మే 5: తెలుగుదే శం పార్టీ పాలనలో చంద్రబాబు నాయుడు బీసీలకు ప్రత్యేక కార్పొరేషన ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సం క్షేమ పథకాలు అమలు చేశారని రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణ మూర్తి, వాల్మీకి సంఘ అధ్యక్షుడు పొదల నరసింహులు పేర్కొన్నారు. రామ సముద్రం మండలం పెద్దకురప్పల్లె పంచాయతీ మట్లవారిపల్లెలో ఆదివారం నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళన సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీ కార్పొ రేషనకు ఎటువంటి నిధులు మంజూరు చేయకుండా బీసీలకు తీరని అన్యా యం చేసిందని, అందుకే ఎన్నికల్లో వైసీపీని ఓడించి బీసీలంతా టీడీపీని గెలి పించాలని ఆయన కోరారు. పొదల నరసింహులు మాట్లాడుతూ వాల్మీకుల ను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి తమ చిరకాల కోరిక తీర్చుకుంటున్నా మన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు, బీసీ నాయకులు జి.గంగరాజు, కొండూరు నారాయణరెడ్డి, ప్రశాంతరెడ్డి, శ్రీనాథ్, రామచంద్ర, రెడ్డెప్ప, రెడ్డిశేఖర్, వేణుగోపాల్, శివ, సీనప్ప, రామకృష్ణ, గంగా ధర్, గోపాలకృష్ణ, తిమ్మప్ప, శ్రీరాములు, రాజారెడ్డి, శంకర, వెంకటేసు, రమేష్, మైనార్టీ నాయకులు ఒంటెల అల్తాఫ్, జావీద్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2024 | 11:50 PM