Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ
ABN, Publish Date - Sep 18 , 2024 | 11:41 PM
మండలంలోని మా న్యం భూములు ఆక్రమణకు గురయ్యాయని జి ల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. బుధవారం మండలంలోని సుండుపల్లెమ్మ, కార్తి కేయ నగర్‌లోని సుబ్రమణ్యంస్వామి, ఓదేటమ్మ ఆలయాల మాన్యం భూములను ఆయన పరి శీలించారు.
జిల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్
సుండుపల్లె, సెప్టెంబరు 18: మండలంలోని మా న్యం భూములు ఆక్రమణకు గురయ్యాయని జి ల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. బుధవారం మండలంలోని సుండుపల్లెమ్మ, కార్తి కేయ నగర్‌లోని సుబ్రమణ్యంస్వామి, ఓదేటమ్మ ఆలయాల మాన్యం భూములను ఆయన పరి శీలించారు. వాటితో పాటు మరికొన్ని చోట్ల దేవ దాయశాఖకు సంబంధించిన భూములు అన్యా క్రాంతం కాగా, ఓదేటమ్మ మాన్యంలో ఏకంగా ప్లాట్లు వేసి విక్రయాలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 511 సర్వే నెంబరులోని మా న్యం భూమిలో ఇతరుల ప్లాట్లకు వెళ్లేందుకు తారు రోడ్డు వేశారన్నారు. అక్కడ 5.14 ఎకరాల దేవుని మాన్యం ఉందన్నారు. అందులో ప్లాట్లు వేసి విక్రయించినట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అన్యాక్రాంతమైన భూముల వివరాలు వెలికి తీస్తామన్నారు. ఒకసారి దేవదాయశాఖ పేరుతో రిజిస్ర్టేషన అయితే ఆ భూములు అమ్మేందుకు అధికారులకు కూడా అనుమతి లే దన్నారు. ఈవో కొండారెడ్డి, టీడీపీనాయకులు మాలేపాటి సురేశనాయుడు, దొరస్వామి నాయు డు, మస్తాన, శివ, విశ్వనాఽథ్ పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
సుండుపల్లె: మండల కేంద్రంలోని విరుపాక్షి చెన్నకేశవస్వామి ఆలయాన్ని జిల్లా దేవదాయ శాఖ అధికారి విశ్వనాథ్ పరిశీలించారు. ఆల యంలో గడ్డి పెంపకంతో పాటు పలు విష యాలపై ఫిర్యాదులు అందడంతో పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. నిత్యం భక్తులు వచ్చే ఆల యాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆలయంలోని చెత్తాచెదారాన్ని గడ్డిని తొలగించాల న్నారు. ఆలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని, ఆలయ గర్భగుడిలో పైకప్పు నుండి వర్షపు నీరు కారుతోందని భక్తులు చెప్పడంతో మరమ్మతుల కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సంద ర్భంగా ఆలయ పూజారి సుబ్రమణ్యంస్వామి రాజీనామా చేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేస్తున్నానని రాజీనామా పత్రాన్ని జిల్లా అధికారికి అందజేశారు.
Updated Date - Sep 18 , 2024 | 11:41 PM