ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాతాళంలోకి.. గంగమ్మ!

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:47 PM

మండలంలో రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు తాగునీటి పథకాలపై ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలం అడుగంటిపోతుండడంతో గ్రామీణులకు తాగునీరందించే బోర్లు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి

వ్యవసాయ బోరు వద్ద నీటికోసం వేచిఉన్న బోయపల్లి మహిళలు

వర్షాకాలంలోనే ఎండిపోతున్న నీటి పథకాలు.. వేసవిలో ఎలాగో..

మండలంలో రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు తాగునీటి పథకాలపై ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలం అడుగంటిపోతుండడంతో గ్రామీణులకు తాగునీరందించే బోర్లు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. సాధారణంగా వేసవిలో మాత్రమే ఎదురయ్యే తాగునీటి కష్టాలు ఆరు నెలల ముందుగానే ప్రారంభమయ్యా యని ప్రజలు ఆంటున్నారు. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. వేసవిలో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబేపల్లె, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలో 38 ఉపరితల నీటి ట్యాంకులు, 35 సింథటిక్‌ ట్యాంకులు,. 150 డైరెక్ట్‌ పంపింగ్‌ నీటి పథకాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో చేతిబోర్లు ఉన్నా అవి పని చేయడం లేదు. దీంతో గుక్కెడు తాగునీటి కోసం కష్టాలు పడుతున్న పల్లెలు ఎన్నో ఉన్నాయి. సంబేపల్లె, మాఽధంవాండ్లపల్లె, నారాయణరెడ్డి, బొగ్గులవారిపల్లె, దొడి ్డసిద్దయ్యగారిపల్లె, నామాలగుట్ట, శెట్టిపల్లి, తూర్పుపల్లి, దొడ్డి సిద్దయ్యగారిపల్లె, శెట్టిపల్లె. బండకాడ హరిజనవాడ తదితర ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్ర యిస్తున్నారు. కొందరు ద్విచక్ర వాహనాలపై వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకుంటుండగా, ఆ అవకాశం లేని పేదలు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ తాగునీటిని భుజాలపై మోసుకుని తెచ్చు కుంటున్నారు. దీంతో కూలి పనులకు వెళ్లే అవకాశం లేక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:48 PM