ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వే పనుల ఆలస్యంపై అధికారుల విచారణ

ABN, Publish Date - Sep 11 , 2024 | 12:00 AM

మదనపల్లె మండలంలో సర్వే పనులు సక్రమంగా జరగడం లేదని ఆలస్యమవుతున్నాయన్న ఫిర్యాదుపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు.

మదనపల్లె టౌన, సెప్టెంబరు 10: మదనపల్లె మండలంలో సర్వే పనులు సక్రమంగా జరగడం లేదని ఆలస్యమవుతున్నాయన్న ఫిర్యాదుపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. పెద్ద సర్వేయర్‌ చెప్పందే సచివాలయాల్లో సర్వే చలాన్లు కట్టించుకోలేదని మాలమహానాడు నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆదేశాలతో డిప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్లు కృష్ణమూర్తి, లక్ష్మినారాయణ లు వేర్వేరుగా విచారణ చేపట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు, మీ సేవాలో చలానాలు కట్టించుకునే సిబ్బంది, రైతుల కు ఫోన్టు చేసి విచారించారు. ఇందులో ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను అడిగి తెలుసు కుని రాత్రి 11.30 గంటల వరకు విచారించారు. దీనిపై డీఐలు విచారణలో తేలిన అంశా లను నివేదిక రాసి జిల్లా సర్వే ఏడీకి పంపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏడీ ఫోన లో మాట్లాడుతూ డీఐల నుంచి రిపోర్టు వచ్చిందని, ఈ రిపోర్టును పరిశీలించి మదనపల్లె మండలంలో సర్వే పనుల ఆలస్యం, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు, డీఐల విచారణలో తేలిన నివేదికను తయారు చేసి కలెక్టర్‌కు పంపుతామన్నారు.

వలసపల్లెలో ఆక్రమణల తొలగింపు

మదనపల్లె మండలం వలసపల్లెలో మంగ ళవారం ఆక్రమణలను అధికారులు తొల గించారు. నవోదయకాలనీలో ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల స్థలాలు కేటాయించారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి న నేపథ్యంలో మంగళవారం హౌసింగ్‌ ఏఈ దీనదయాళ్‌, వీఆర్‌వో శ్రీనివాసులు అక్కడికి వెళ్లి విచారించారు. హౌసింగ్‌ ఇంటి స్థలం కేటాయించిన వ్యక్తి, పక్కనే ఉన్న మరో వృద్ధురాలి నుంచి ఇంటి స్థలం కొను గోలు చేసిన అంశంపై విచారించారు. దీంతో పాటు ఈ రెండు స్థలాల పక్కన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పునాదులు వేసి ఉండటంతో ఎక్స్‌కవేటర్‌ తీసుకొచ్చి అక్రమ పునాదు లను తొలగించారు. వీఆర్‌వో శ్రీనివాసులు మాట్లాడుతూ నవోదయ కాలనీలో 2019-20 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారని, వారిలో అనర్హులు ఎక్కువగా ఉన్నారని ఉన్న తాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయన్నారు. దీనిపై సమగ్రంగా విచారించి ఆర్‌ఐ, తహసీ ల్దార్‌కు వివరిస్తామన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 12:00 AM

Advertising
Advertising