YSRCP: రీ సర్వే డ్రోన్లు ఢమాల్.. రూ. 200 కోట్లు వృథా చేసిన జగన్
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:55 AM
జగన్ హయాంలో కొన్న డ్రోన్ల భాగోతం తాజాగా బయటకు వచ్చింది. భూముల సర్వేపేరు చెప్పి ఆధునిక టెక్నాలజీని వాడుతున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేసి రూ. 2 వందల కోట్లతో ఎందుకూ పనికిరాని డ్రోన్లు రూవర్లు కొన్నారు. వంద కోట్ల రూపాయల మేర ఉన్న ఏ కొనుగోలు అయినా న్యాయ కమిషన్ ఆమోదానికి వెళ్లాల్సి ఉండగా.. దాని నుంచి తప్పించి బిట్లు బిట్లుగా కొనుగోలు చేయించారు.
అమరావతి: జంతర్ మంతర్ జగన్ (Jagan) పాలనలో ఇదో కొత్త కోణం.. కాసుల యావలోపడి నాడు అత్యంత దారుణమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా డ్రోన్ల (Drones) భాగోతం బయటకు వచ్చింది. భూముల సర్వేపేరు చెప్పి ఆధునిక టెక్నాలజీని వాడుతున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేసి రూ. 2 వందల కోట్లతో ఎందుకూ పనికిరాని డ్రోన్లు రూవర్లు కొన్నారు. వంద కోట్ల రూపాయల మేర ఉన్న ఏ కొనుగోలు అయినా న్యాయ కమిషన్ ఆమోదానికి వెళ్లాల్సి ఉండగా.. దాని నుంచి తప్పించి బిట్లు బిట్లుగా కొనుగోలు చేయించారు. ఓ రాజకీయ సలహాదారు బినామీలకు లబ్ది చేకూర్చారు. ప్రభుత్వానికి చెత్త డ్రోన్లు, రూవర్లు వచ్చి పడ్డాయి. కొన్నందుకు వాటిని భూముల సర్వే పేరిట కొద్ది రోజులు ఆకాశంలో తిప్పారు. ఇప్పుడవి మూలన పడ్డాయి.
పాడైన డ్రోన్లకు మరమ్మతులు చేయించాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాల్సిందే. మళ్లీ తన ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో అనామాక కంపెనీల నుంచి డ్రోన్లు కొని వాటిని కనీసం పక్షం రోజులు కూడా వాడకుండా పక్కనపడేశారు. కొన్నందుకు కంపెనీల ఖాతాల్లో ప్రభుత్వ ధనం జమ అయింది. సర్కారుకు కొత్త సరుకు వచ్చింది.. ఇప్పుడవి ఇనప ముక్కలుగా మిగిలిపోయేలా ఉన్నాయి. రూ. 2 వందల కోట్లు వెచ్చించి కొన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడకపోతే ఎవరిది బాధ్యత. ప్రజా ధనం దుర్వినియోగం చేసినందుకు ఎవరిపై చర్యలు తీసుకుంటారు... రీ సర్వేను ఆపేసిన కూటమి ప్రభుత్వం.. ఆ పేరిట జరిపిన కొనుగోళ్ల అక్రమాలపై దృష్టి సారించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జగన్ సర్కార్ 2019 డిసెంబర్‌లో భూముల సర్వే ప్రారంభించింది. కానీ సర్వే సరిహద్దుల చట్టాన్ని త్రికరణ శుద్దిగా అమలు చేయలేదు. భూములను నేలమీద ఉండి కొలిస్తేనే అనేక సమస్యలు వస్తున్నాయి. కోర్టుల్లో భూ వివాదాలు ఉంటున్నాయి. జగన్ సర్కార్ ఈ వాస్తవాన్ని గమనించకుండా చాలా బెస్టు అనిపించుకోవాలనుకుంది. డ్రోన్లు విని విమానాలతో ఆకాశం నుంచి భూముల ఫోటోలు తీసి వాటి ఆధారంగా సర్వే చేయించాలని పెద్ద ప్లాన్ వేశారు. సంప్రదాయ పద్ధతుల్లో సర్వే చేయాలంటే కొత్తగా ఏ పరికరం కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే సర్వేయర్ల వద్ద ఉన్న చైన్లు, ఇతర సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. జగన్ సర్కార్, ఆయన అనుంగ అధికారులు ఖరీదైన సాంకేతికతను తెచ్చిపెట్టుకోవాలని ఇందుకోసం భారీగా కొనుగోళ్లు జరపాలని భావించారు. రూవర్లు, డ్రోన్లు, కంప్యూటర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనాలని నిర్ణయించారు. అయితే ఇందులో ఏ మాత్రం పారదర్శకతను ప్రదర్శించకూడదు అనుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు
పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
ఏఐసిసి అంతర్గత సమావేశంలో పాల్గొనున్న సీఎం రేవంత్
వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 12 , 2024 | 11:56 AM