ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవమానిస్తూ మాట్లాడడం సరికాదు

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:28 AM

మేయరు సురేశబాబు, కార్పొరేటర్ల ను కడప ఎమ్మెల్యే మాధవి అవమానిస్తూ మాట్లాడడం సరికాదని వైసీపీ మహిళా కార్పొరేటర్లు, కో ఆప్షన సభ్యులు తెలిపారు.

ఐదు నెలలైనా నిధులు వచ్చాయా? ఫ వైసీపీ మహిళా కార్పొరేటర్లు

కడప ఎడ్యుకేషన, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):మేయరు సురేశబాబు, కార్పొరేటర్ల ను కడప ఎమ్మెల్యే మాధవి అవమానిస్తూ మాట్లాడడం సరికాదని వైసీపీ మహిళా కార్పొరేటర్లు, కో ఆప్షన సభ్యులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అ యినా నగరాభివృద్ధికి ఎన్ని నిధులు తెప్పించారో ఎమ్మెల్యే తెలపాలన్నారు. శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ నగర ప్రథమ పౌరుడైన మేయరు, వైసీపీ కార్పొరేటర్లను అవమానిస్తూ మాట్లాడడం సబబుకాదన్నారు. కనీసం కార్పొరేటరు అని కూడా విలువ ఇవ్వకుండా టీడీపీ కార్పొరేటరును అవమానించారని, అది ఎమ్మెల్యేకు తగదన్నారు. కార్పొరేటర్లుగా మాకు రక్షణ లేదు కాబట్టే ఎస్పీని ఆశ్రయించామన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వడంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు శ్రీలేఖ, శ్రీలత, మల్లేశ్వరి, మాధవి, కో ఆప్షన సభ్యులు పత్తిరాజేశ్వరి, మహిళా నాయకులు వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:28 AM