ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమాజ హితం కోసం జర్నలిస్టుల కృషి

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:13 AM

సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే జర్నలిస్టులు ఎల్లప్పుడు పనిచేస్తుంటారని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు.

వేంపల్లె ఏపీడబ్ల్యూజే నూతనకార్యవర్గ ఎంపిక సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి

ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి

వేంపల్లె, సెప్టెంబరు 8: సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే జర్నలిస్టులు ఎల్లప్పుడు పనిచేస్తుంటారని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనవృత్తి ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో అందరిని సంతృప్తిపరిచే పరిస్థితి ఉండదని తెలియజేశారు. వేంపల్లెలోని ఆర్‌అండ్‌బీ అతిథి భవనంలో ఏపీడబ్ల్యూజే వేంపల్లె మండల నూతన కార్యవర్గ ఎంపిక సమావేశం ఆదివారం జరిగింది. ఎలక్ర్టానిక్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, సర్పంచు ఆర్‌ శ్రీను, టీడీపీ మండల కన్వీనర్‌ మునిరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జయరామిరెడ్డి, యువనాయకులు రజనీకాంతరెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి గాలి హరిప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మ, ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌ పాల్గొని మాట్లాడారు.

నూతన కార్యవర్గం ఎంపిక: వేంపల్లె మండల ఏపీడబ్ల్యూజే నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి ప్రకటించారు. అధ్యక్షుడిగా రఘునాథరెడ్డి, కార్యదర్శిగా బాలం జయచంద్ర, కోశాధికారిగా షేక్‌ ఖదిర్‌, ఉపాధ్యక్షుడిగా బాలం హరిమనోహర్‌, కృష్ణమోహనరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, కేశవరెడ్డి, రామకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా సుబ్బారెడ్డి, అమర్‌నాథరెడ్డి, రమేష్‌, శ్రీనివాసులరెడ్డి, అంజాద్‌బాష, సహాయ కార్యదర్శులుగా రవికుమార్‌, వెంకటరమణ, రహీం, కమిటీ సభ్యులుగా హరి,నాగేశ్వర్‌రావు తదితరులను ఎన్నుకున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 12:14 AM

Advertising
Advertising