కమనీయం.. వరసిద్ధి వినాయకుడి కల్యాణం
ABN, Publish Date - Sep 14 , 2024 | 11:35 PM
స్థానిక పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేవుట్‌లో వరసిద్ధి వినాయక స్వామి ఆల యంలో ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం కమనీయం, కన్నుల పం డువగా నిర్వహించారు.
మదనపల్లె అర్బన, సెప్టెంబరు14: స్థానిక పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేవుట్‌లో వరసిద్ధి వినాయక స్వామి ఆల యంలో ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం కమనీయం, కన్నుల పం డువగా నిర్వహించారు. శనివారం ముం దుగా ఆలయకమిటీ సభ్యులు ఉత్సవ మూ ర్తులకు పట్టువస్త్రాలను ఊరేగింపు గా తీసుకొచ్చి సమర్పించారు. సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడి కల్యాణోత్సవంలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమ, గాజులను అందజేశారు. వినాయక స్వామి మూడు లడ్డులు, మూడు టెంకాయలను వేలం నిర్వహించారు. ఆందులో వీరభద్రారెడ్డి,రూ. 19 వేలకు, వెంకటరమణ రూ. 7 వేలకు, మోడెం వెంకటరమణ రూ. 6300లకు దక్కించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశా రు. దాతలలు ఆలయంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. సాయం త్రం పుష్పపల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల యకమిటీ అధ్యక్షుడు సిద్దులు, గౌరవాధ్యక్షుడఉ కాలా సోముశేఖర్, ఆలయకమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వినాయకుడి లడ్డూ రూ. 50,116
మదనపల్లె అర్బన, సెప్టెంబరు14: పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో శనివారం వినాయకుడి ఊరేగింపు సందర్భంగా లడ్డు వేలంపాట నిర్వ హించగా కాలనీకి చెందిన బార్గవ్ రూ. 50,116 సొంతం చేసుకున్నారు. స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యు లు జితేంద్రరెడ్డి, సాయి, జిత్తు, హేము, కౌస్సిక్, తదితరులు పాల్గొన్నారు.
కలకడలో:మండలంలోని కోటగుడిబండలో రావిమానుయువసేన ఆధ్వర్యంలో వినాయకుడికి నైవేథ్యంగా సమర్పించిన 10 కిలోల లడ్డుకు వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన పరసా శివయ్య రూ.35వేలు వెచ్చించి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భం గా స్వామి వారికి ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం గణనాథుడిని ప్రత్యేక అలంకరించి పురవీధులో ఊరేగించి నిమజ్జనం చేశారు.
నరసింహస్వామికి ప్రత్యేక పూజలు
గుర్రంకొండ, సెప్టెంబరు 14:గుర్రం కొండ మండలంలోని తరిగొండలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆల యంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వ హించారు. ఉదయాన్నే ఆలయంలో అర్చన, పంచామృతాభిషేకం, విశేష పూజలను చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలను చేశారు. స్వామి వారికి అభిషేకాలను చేయించడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. కార్యక్ర మంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పంచముఖ ఆంజనేయస్వామికి పూజలు
కలకడ, సెప్టెంబరు 14:మండలం లోని బాటవారిపల్లెలో కొలువైన పం చముఖ ఆంజనేయస్వామి ఆల యంలో శనివారం స్వామి వారికి విశేష పూజలను చేశారు. ఈ సంద ర్భంగా వేకువ జామునే స్వామి వారి ని ప్రత్యేకంగా అలంకరించి అనంతరం నైవేథ్యం సమర్పించి అభిషేకం, ఆకుపూజ కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆల యానికి విచ్చేసి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Updated Date - Sep 14 , 2024 | 11:35 PM