ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: పదవి పోయినా కొరముట్ల ఇలా చేస్తున్నారేంటి?

ABN, Publish Date - Jul 09 , 2024 | 12:21 PM

తాజా మాజీ ఎమ్మెల్యేకి పదవి పోయినా గతంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన స్టిక్కర్‌ మాత్రం ఊడలేదు..! నెంబరు ప్లేట్‌కు...

కడప/రైల్వేకోడూరు: తాజా మాజీ ఎమ్మెల్యేకి పదవి పోయినా గతంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన స్టిక్కర్‌ మాత్రం ఊడలేదు..! నెంబరు ప్లేట్‌కు ప్రభుత్వ విప్‌ అంటూ స్టిక్కర్‌ను తొలగించలేకున్నారు. ఆయనతో పాటు చాలా వైసీపీ నేతల కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు.


సోమవారం రైల్వేకోడూరు టోల్గేట్‌ సెంటర్‌లో దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా పూలమాలలు వేయడానికి తాజా మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వచ్చారు. తన ఓల్వో కారుకు ముందు వెనుక ప్రభుత్వ విప్‌ స్టిక్కర్‌ ఉంది. ఎన్నికలు అయిపోయాయి, కోడూరులో వైసీపీ ఓడిపోయింది. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. అయినా తాను మాజీ ఎమ్మెల్యే అనుకోకుండా ఊహల్లో ఉండి కారుకు ఉన్న స్టిక్కర్‌ను తొలగించకుండా తాజా మాజీ ఎమ్మెల్యే తిరుగుతుండడం పట్ల కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులకు ఉన్న కార్ల కు కూడా ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్నాయి. కొందరు హుందాగా తీసివేసినా తాజా మాజీ మాత్రం తొలగించకుండా అట్లే పెట్టుకున్నారు. దీంతో సర్వత్రా ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Jul 09 , 2024 | 12:21 PM

Advertising
Advertising
<