ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూడోసారీ వాయిదా పడ్డ కొత్తూరు విద్యాకమిటీ ఎన్నికలు

ABN, Publish Date - Aug 31 , 2024 | 11:59 PM

టీడీపీ, వైసీపీ నాయకుల తీవ్ర పోటీ వల్ల కొత్తూరు విద్యాకమిటీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. మండలంలోని కొత్తూరు విద్యాకమిటి ఛైర్మన్‌ ఎన్నికలు ఈ సారి కూడా వాయిదా పడ్డాయి. పోరుమామిళ్ల మండలంలోని కొత్తూరు (సిద్దనకిచ్చాయపల్లె) విద్యాకమిటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో వైసీపీ నాయకులు తీవ్రంగా పోటీ పడడంతో రెండు దఫాలుగా ఈ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి.

పోరుమామిళ్ల, ఆగస్టు 31 : టీడీపీ, వైసీపీ నాయకుల తీవ్ర పోటీ వల్ల కొత్తూరు విద్యాకమిటీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. మండలంలోని కొత్తూరు విద్యాకమిటి ఛైర్మన్‌ ఎన్నికలు ఈ సారి కూడా వాయిదా పడ్డాయి. పోరుమామిళ్ల మండలంలోని కొత్తూరు (సిద్దనకిచ్చాయపల్లె) విద్యాకమిటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో వైసీపీ నాయకులు తీవ్రంగా పోటీ పడడంతో రెండు దఫాలుగా ఈ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి. శనివారం అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు నోటీసులు ఇచ్చారు. 18 మంది విద్యార్థులుండగా 13 మంది మాత్రమే మెంబర్లు ఉండడంతో ఏడుమంది వైసీపీకి, ఆరు మంది టీడీపీకి గతంలో నిలవడంతో పోటీ తీవ్రమైంది. అఽధికారంలో ఉన్నాం కాబట్టి ఈ సారి తమకే వదిలేయాలని గతంలో టీడీపీ నాయకులు డిమాండ్‌ చేయడంతో వైసీపీ నాయకులు కూడా సంఖ్యాబలం ఎక్కువగా ఉందని తమకే ఇవ్వాలని పట్టుబడడంతో గత రెండుసార్లు ఈ ఎన్నిక వాయిదా పడింది. శనివారం మెంబర్లకు తప్ప మిగతా వారిని ఎవరినీ ఆ పాఠశాల ప్రాంగణంలో ప్రవేశించకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంటిగంట అవుతున్నా గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు ఎవరూ హాజరు కాకపోవడంతో ప్రత్యేక అధికారి కేశవరెడ్డి వాయిదా వేశారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలపనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల ఎస్‌ఐ కొండారెడ్డి, ఎంఈవో బాల అంకిరెడ్డి పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బద్వేలు నుంచి కూడా పోలీసు అధికారులు గ్రామానికి వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 31 , 2024 | 11:59 PM

Advertising
Advertising