ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నరకం అనుభవిస్తున్నా...

ABN, Publish Date - Aug 27 , 2024 | 11:56 PM

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఏడాది రక్రితం కువైత్‌కు వచ్చానని, అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన ఇంటి యజమానులు తనకు నరకం చూపిస్తున్నారని అయినా వాటిని భరిస్తూ వచ్చానని... అయితే నాలుగు రోజుల క్రితం తన భర్త చనిపోయాడని తెలిసిందని, తాను ఇండియాకు వెళతానని చెప్పినా తనను పంపకుండా ఇంకా ఎక్కువగా వేధిస్తున్నారని నారా లోకేశ్‌ అన్నా... నన్ను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ఓ మహిళ పంపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

తనను ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్న మయిమూన్‌

భర్త చనిపోయినా ఇంటికి పంపలేదు

నారా లోకేశ్‌ అన్నా.. కాపాడండి...

కువైత్‌ నుంచి వీడియో కాల్‌లో మహిళ ఆవేదన

నిమ్మనపల్లి, ఆగస్టు 27: ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఏడాది రక్రితం కువైత్‌కు వచ్చానని, అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన ఇంటి యజమానులు తనకు నరకం చూపిస్తున్నారని అయినా వాటిని భరిస్తూ వచ్చానని... అయితే నాలుగు రోజుల క్రితం తన భర్త చనిపోయాడని తెలిసిందని, తాను ఇండియాకు వెళతానని చెప్పినా తనను పంపకుండా ఇంకా ఎక్కువగా వేధిస్తున్నారని నారా లోకేశ్‌ అన్నా... నన్ను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ఓ మహిళ పంపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంగంవారిపల్లి పంచాయతీ సింగంవారిపల్లికి చెందిన రెడ్డిబాషా భార్య మయిమూన్‌కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురి పెళ్లి కోసం అప్పులు చేయడంతో వాటిని తీర్చేందుకు ఏడాది క్రితం కువైత్‌లోని సబాసాలేలో ఇంటిలో పనిచేసేందుకు వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ఇంటి యజమానులు తనకు నరకం చూపిస్తున్నా వాటిని భరించి అప్పులు తీర్చాలన్న ఉద్దేశ్యంతో వాటిని భరిస్తూ ఇక్కడే ఉన్నానని తెలిపింది. కాగా నాలుగు రోజుల క్రితం తన భర్త రెడ్డిబాషా అనారోగ్యంతో మరణించినట్లు కుమారుడు సయ్యద్‌బాషా తెలిపాడన్నారు. అప్పటి నుంచి తన యజమానురాలిని నేను ఇంటికి వెళతానని తన భర్త చనిపోయాడని చెప్పినా వినకుండా నీవు ఇంటికి పోవాలంటే వెయ్యి దీనార్లు కట్టి వెళ్లమని చెబుతోందని, తన భర్త చనిపోయిన ఫొటోలను చూపించినా వారు నమ్మలేదని రోదించింది. అంతేకాకుండా తనకు సక్రమంగా అన్నం కూడా పెట్టలేదని నాకు ఎవ్వరూ తెలిసిన వాళ్లు లేరని తనను నారా లోకేశ్‌ అన్న కాపాడి ఇండియాకు రప్పించాలని వేడుకుంది. దీనిపై మయిమూన్‌ కుమారుడు సయ్యద్‌బాషా మాట్లాడుతూ తన తండ్రి చనిపోయి నాలుగు రోజులైందని, ఈ విషయాన్ని కువైత్‌లో ఉన్న తన తల్లి మయిమూన్‌కు తెలిపినట్లు చెప్పాడు. తన తల్లిని నరకం నుంచి కాపాడి ఇండియాకు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరాడు.

Updated Date - Aug 28 , 2024 | 01:26 PM

Advertising
Advertising
<